Begin typing your search above and press return to search.

అవును నాకు అఫైర్స్ చాలా ఉన్నాయ్: స్టార్ నటి

By:  Tupaki Desk   |   1 May 2020 2:30 AM GMT
అవును నాకు అఫైర్స్ చాలా ఉన్నాయ్: స్టార్ నటి
X
టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ల‌క్ష్మీ రాయ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ భామ సినిమాల కంటే కూడా ఎక్కువ‌గా వివాదాల‌తోనే వార్తల్లో నిలిచింది. అందం అభినయం ఉన్న ఈ ముద్దుగుమ్మ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ గా పేరుతెచ్చుకుంది. తాజాగా తన మీద వచ్చిన రూమర్స్ అన్నింటిపై స్పందించింది. టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న రాయ్ లక్ష్మి.. త‌న‌పై వస్తున్న అస‌త్య ప్ర‌చారాలను ఖండించింది. ఆమె మాట్లాడుతూ.. "అవును. నాకు చాలా మందితో ల‌వ్ ఎఫైర్స్ ఉన్నాయి. బ్రేకప్స్ కూడా జరిగాయి. అంత మాత్రానికే ఇష్టం వచ్చినట్లు రాస్తారా.. అని ఘాటుగా మాట్లాడింది. ఇప్ప‌టికే మూడు సార్లు ప్రేమ‌లో మోస‌పోయాన‌ని.. ఇప్పుడు త‌న దృష్టి మొత్తం సినిమాల‌పైనే ఉంద‌ని చెబుతుంది ఈ రత్తాలు.

ఇంకా.. ఇండ‌స్ట్రీకి రావ‌డానికి తను పెద్ద‌గా క‌ష్ట‌ ప‌డ‌లేద‌ని.. త‌న‌కు ఈజీగా ఆఫ‌ర్స్ వ‌చ్చాయ‌ని చెబుతుంది. అయితే ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ మాత్రం ఉంద‌ని స‌మాధానం చెప్పింది. ఈ విష‌యంలో కూడా మొద‌ట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. నిజానికి క్యాస్టింగ్ కౌచ్ కాదు కానీ కొంద‌రు ఇచ్చిన త‌ప్పుడు స‌ల‌హాలే త‌న కెరీర్ నాశ‌నం చేశాయని చెబుతుంది. ఆ త‌ర్వాత కూడా కొంద‌రు హీరోల‌తో ఎఫైర్స్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవ‌న్నీ నిజ‌మే అంటోంది ఈ ముద్దుగుమ్మ‌. కానీ ఎంత‌మందితో రిలేష‌న్ ఉన్నా.. ఒక మంచి వ్య‌క్తి దొరుకుతాడ‌ని వేచి చూస్తున్నాని చెప్తుంది ల‌క్ష్మీ రాయ్. ఇక ప్రస్తుతం కెరీర్ పైనే ఫోకస్ పెట్టినట్లు తేల్చి చెప్పేసింది.