Begin typing your search above and press return to search.
'LKG' ట్రైలర్: పవర్ స్టార్ సినిమా చూస్తే ఆయన పార్టీలో జాయిన్ అవుతున్నట్లా?
By: Tupaki Desk | 22 Jun 2021 3:09 PM GMT100% తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ ని స్ట్రీమింగ్ పెడుతూ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్ లో విడుదలైన పలు డబ్బింగ్ సినిమాలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఈ క్రమంలో తమిళ్ లో మంచి విజయం సాధించిన ''LKG - 2020''(ఎల్. కె. జి) చిత్రాన్ని ఆహా లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తమిళ నటుడు ఆర్జే బాలాజీ - 'లీడర్' భామ ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన పొలిటికల్ సెటైరికల్ సినిమా 'LKG - 2020'. కేఆర్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ కథ - స్క్రీన్ ప్లే అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా.. ఇషారీ కె గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'ఆహా' ఓటీటీలో జూన్ 25 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు.
ఇందులో ఆర్జే బాలాజీ రాజకీయ నాయకుడిగా నటించగా.. జెకె రితేష్ - నంజిల్ సంపత్ కీలక పాత్రలు పోషించారు. 'ఎల్.కె.జి' అంటే లంకవరపు కుమార్ గాంధీ అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. 'దేవుళ్ళారా మిమ్మల్ని ఈ చిన్న రూమ్ లో పెట్టి పూజిస్తున్నందుకు ఫీల్ అవ్వకండి.. త్వరలోనే నేను గొప్ప వాడినవుతాను.. మూడు వేల కోట్లతో మీకు విగ్రహాలు పెట్టిస్తాను' అంటూ దేవుళ్ళకు ప్రామిస్ చేయడం కొత్తగా ఉంది. విన్స్టల్ చర్చిల్ ఓ సందర్భంలో పాలిటిక్స్ అనేది గేమ్ కాదని బిజినెస్ అని చెప్పినట్లు ఈ ట్రైలర్ లో ప్రస్తావించారు.
పవర్ స్టార్ సినిమా చూస్తే ఆయన పార్టీలో జాయిన్ అవుతున్నట్లా అంటూ సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం గురించి చెబుతున్నారు. 'క్రికెటర్ లక్ష్మణ్ హాఫ్ సెంచరీ లేదా సెంచరీ చేస్తే ఇండియన్ క్రికెటర్ సూపర్ అంటూ మీడియా పొగుడుతుంది. అంతేకాని తెలుగు క్రికెటర్ అని అనరు. అదే ఓ ఫిషర్ మ్యాన్ చంపబడితే ఇండియన్ ఫిషర్ మ్యాన్ అని మీడియా చెప్పదు. తెలుగు ఫిషర్ మ్యాన్ అని సంభోదిస్తారు. ఎందుకు?' అంటూ చెప్పే డైలాగ్ ఆలోచింప జేస్తోంది. 'ఆహా' వేదికగా మరో మూడు రోజుల్లో వస్తున్న 'LKG' సినిమా తెలుగులో ఎలాంటి ఆదరణ తెచ్చుకుంటుందో చూడాలి.