Begin typing your search above and press return to search.
'పుష్ప-2'లో ఐటం గర్ల్ గా 'లోఫర్' బ్యూటీ
By: Tupaki Desk | 24 March 2022 4:47 AM GMTపాన్ ఇండియా చిత్రం 'పుష్ప-2'లో 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' పాట ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. పాటలో నర్తించిన హీరోయిన్ సమంత క్రేజ్ ఒక్క పాటతోనే పాన్ ఇండియాకి రీచ్ అయింది. బ్యూటీ సిజ్టింగ్ మూవ్ మెంట్స్..బోల్డ్ అండ్ -ఎనర్టిటక్ కిల్లర్ లుక్ ఎక్స్ ప్రెషన్స్ తో సరికొత్త సమంతని వెండి తెరపై ఆవిష్కరించింది. సమంత నుంచి ఈ రేంజ్ పెర్పార్మెన్స్ మేకర్స్ సైతం ఊహించి ఉండరు? ఆ పాట అంత పెద్ద సక్సెస్ అయిందంటే? సమంతనే కీలకంగా చెప్పుకోవాలి.
హీరోయిన్ గా టాలీవుడ్ లో ఆమె క్రేజ్ కారణంగానూ మాస్ సాంగ్ ఆ రేంజ్ లో ఫోకస్ అయింది. సోషల్ మీడియాలో అతికొద్ది రోజుల్లోనే పాట 100మిలియన్ల వ్యూస్ ని సైతం దక్కించుకుని ట్రెండింగ్ లో నిలిచింది. సినిమా సక్సెస్ లో ఆ పాట కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం సుకుమార్ అండ్ కో 'పుష్ప ది రూల్' షూట్ లో బిజీ అవుతున్నారు. అదిరిపోయే మాస్ సాంగ్ రెండవ భాగంలోసైతం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సుకుమార్-దేవి శ్రీప్రసాద్ మాస్ అప్పీరియన్స్ కోసం కచ్చితంగా అలాంటి నెంబర్ ఒకటి ప్లాన్ చేస్తారని ఆడియన్స్ ముందుగానే ఊహిస్తున్నారు.
వాళ్ల అంచనాలకు తగ్గట్టుగానే పార్ట్-2లో అలాంటి సాంగ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారుట. అయితే ఈ పాట లో సమంతని కొనసాగించే అవకాశం ఎంత మాత్రం లేదని సమాచారం. పాటలో ఫ్రెష్ ఫీల్ రావాలంటే కొత్త ముఖాన్ని పరిచయం చేయాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. ఆ దిశగానే సుకుమార్ అడుగులు వేస్తున్నారుట. సమంత స్థానంలో బాలీవుడ్ నటి దిశా పటానీని ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.
వాస్తవానికి మొదటి భాగం ఐటం పాటకి దిశా పటానీనే ఎంపిక చేయాలని భావించారుట. కానీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని సమంతని లాక్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈసారి మాత్రం ఐటం ఛాన్స్ దిశా పటానీకే ఇవ్వాలని మేకర్స్ స్ర్టాంగ్ గా ఉన్నట్లు తెలుస్తుంది. దిశా పటానీ వెరీ ట్యాలెంటడ్. బాలీవుడ్ లో ఇప్పటికే 'వెల్కమ్ టూ న్యూయార్క్' ...'భాగీ' చిత్రాల్లో స్పెషల్ అప్పీరియన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
'లోఫర్ ' చిత్రంతో తెలుగు లో హీరోయిన్ గానూ సుపరిచితురాలే. బాలీవుడ్ లో బిజీ నటి. వీటన్నింటిని మించి హిందీ బెల్డ్ లో 'పుష్ప ది' రైజ్ భారీ విజయం సాధించింది. ఆ క్రేజ్ ని కొనసాగించాలంటే ఇలా బాలీవుడ్ భామని సినిమాలో ఏదో రూపంలో వినియోగించుకోగల్గితే కలిసొస్తుంది.
ప్రధానంగా ఆ ఉద్దేశంతోనే దిశా పటానీ వైపు మేకర్స్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాల్ని దర్శక-నిర్మాతలు ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతం దిశా పటానీ బాలీవుడ్ లో 'ఏక్ విలన్ రిటర్న్స్'..' యోధ'..'టీనా' చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి.