Begin typing your search above and press return to search.

బెంగాల్ టైగ‌ర్‌ కు ఎఫెక్ట్ ప‌డింది..!

By:  Tupaki Desk   |   17 Dec 2015 12:15 PM GMT
బెంగాల్ టైగ‌ర్‌ కు ఎఫెక్ట్ ప‌డింది..!
X
మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ లేటెస్ట్ మూవీ బెంగాల్ టైగ‌ర్ సినిమా వ‌సూళ్లు వీకెండ్ త‌ర్వాత బాగా డ్రాప్ అయ్యాయ‌ని టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. గురువార‌మే సినిమా రిలీజ్ అవ్వ‌డంతో లాంగ్ వీకెండ్ బాగానే క‌లిసి వ‌చ్చింది. నాలుగు రోజుల సూపర్‌ వీకెండ్‌ తర్వాత సోమవారం టైగ‌ర్ వ‌సూళ్లు డ్రాప్ అవ్వ‌గా....మంగ‌ళ‌వారం - బుధ‌వారం మ‌రింత డ‌ల్ అయిపోయాయి. దీంతో ఈ సినిమా ఓన్లీ వ‌న్ వీక్ మూవీగా మిగిలిపోయే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. మెగాఫ్యామిలీ హీరో వ‌రుణ్‌ తేజ్ న‌టించిన లోఫ‌ర్ కూడా ఈ వీకెండ్‌ లో ఒక రోజు ముందుగానే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. దీంతో సెకండ్ వీక్‌లో బెంగాల్ టైగ‌ర్ గ‌ర్జ‌న‌లు వినిపించే ఛాన్సులు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి.

లోఫ‌ర్ దెబ్బ‌కు బీ - సీ సెంట‌ర్ల‌లో చాలా చోట్ల ఈ సినిమాను వ‌న్ వీక్‌ తోనే ఎత్తేశారు. అస‌లే మాస్ మూవీ...ఏ సెంట‌ర్ల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కాదు. కాస్తో కూస్తో వ‌సూళ్లు రాబ‌ట్టే బీ - సీ సెంట‌ర్ల‌లో కూడా లోఫ‌ర్ ఎఫెక్ట్ టైగ‌ర్‌ పై బాగానే ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు అమ్మిన రేటుతో పోలిస్తే 70 శాతం వ‌సూళ్లు ఈ సినిమా రాబ‌ట్టిన‌ట్టు స‌మాచారం. ఇంకా రావాల్సింది 30 శాత‌మే అయినా లోఫ‌ర్‌ తో పాటు రేపు షారుఖ్ దిల్‌ వాలే - బాజీరావు మ‌స్తానీ సినిమాలు ఉన్నాయి. ఏ సెంట‌ర్ల‌తో పాటు బీ సెంట‌ర్ల‌లో కూడా ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ పోటీని త‌ట్టుకుని టైగ‌ర్ బ్రేక్ ఈవెన్‌ కు చేరుకోవ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది.

అయితే ఉన్నంత‌లో బెట‌ర్ ఏంటంటే ర‌వితేజ చివ‌రి చిత్రం కిక్ 2 డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో పాటు ఆ సినిమాకు క‌నీసం వ‌సూళ్లు కూడా ద‌క్క‌లేదు. ర‌వితేజ మార్కెట్ కాస్త డ‌ల్ అయ్యిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల్లో ముందే అంచ‌నాలు ఉన్నాయి. దీంతో బ‌య్య‌ర్లు రీజ‌న్‌ బుల్ రేటుకే ఈ సినిమా పంపిణీ హ‌క్కులు ద‌క్కించుకున్నారు. అలాగే టాలీవుడ్‌ కు పెద్ద‌గా క‌లిసిరాని న‌వంబ‌ర్ నెల‌లో రిలీజ్ అవ్వ‌డంతో ఎక్కువ రేట్ల‌కు కొనేందుకు ఎవ్వ‌రూ ఆస‌క్తి చూప‌లేదు. దీంతో ఫైన‌ల్‌ గా బెంగాల్ టైగ‌ర్ బ‌య్య‌ర్లు త‌క్కువ న‌ష్టంతోనే బ‌య‌ట ప‌డే సూచ‌న‌లు ఉన్నాయి. ఈ రోజు రిలీజ్ అయిన లోఫ‌ర్ కూడా మాస్ సెంట‌ర్ల‌లో టైగ‌ర్‌ కు బాగా దెబ్బేసింది. ఫైన‌ల్‌ గా బెంగాల్ టైగ‌ర్ ర‌వితేజ ఫ్యాన్స్ ఆశిస్తున్న‌ట్టు రూ.30 కోట్ల షేర్ కాదు క‌దా...రూ.25 కోట్ల షేర్ సాధిస్తేనే గొప్ప అనుకోవాల్సిందే. వ‌చ్చే వారం సౌఖ్యం - మామ మంచు - అల్లుడు కంచు ఉండ‌డంతో అప్ప‌ట‌కీ ఈ సినిమా అన్ని ఏరియాల్లోనే ఎత్తివేయ‌డం ఖాయం. సెకండ్ వీక్‌ లో బ్యాలెన్స్ పెట్టుబ‌డి ర‌క‌వ‌రీ క‌ష్టంగానే ఉంది.