Begin typing your search above and press return to search.
లోఫర్.. అందరికీ టెన్షనే
By: Tupaki Desk | 17 Dec 2015 4:50 AM GMTలోఫర్.. ఇలాంటి పేరు పెట్టి సినిమా తీయగలిగే ధైర్యం ఒక్క పూరి జగన్నాథ్ కు మాత్రమే ఉంటుంది. ఇంతకుముందు ఇడియట్ - పోకిరి లాంటి టైటిళ్లను జనాలు ఆమోదించేలా చేసుకున్న పూరి.. ‘లోఫర్’ విషయంలో ఎలాంటి రెస్పాన్స్ అందుకోబోతున్నాడన్నది ఆసక్తి రేపుతోంది. పైన చెప్పుకున్న సినిమాల టైం వేరు. అప్పటి పూరి ఫామ్ వేరు. కానీ ఇప్పుడు పూరి బండి అప్ అండ్ డౌన్స్ తో నడుస్తోంది. ‘టెంపర్’లో చూపించిన పవర్ అంతా ఆయనది కాదు. అందులో వక్కంతం వంశీ హ్యాండ్ ఉంది. దాని తర్వాత వచ్చిన ‘జ్యోతిలక్ష్మీ’ పూరి పెన్ పవర్ మీద మళ్లీ సందేహాలు రేకెత్తించింది. మెగాస్టార్ చిరంజీవికి కూడా పూరి మీద సందేహాలు కలిగించింది. ఈ పరిస్థితుల్లో ‘లోఫర్’తో తనేంటో చూపించాల్సిన స్థితిలో ఉన్నాడు పూరి.
ఇక మెగా కుర్రాడు వరుణ్ తేజ్ కు కూడా ‘లోఫర్’ కీలకమైన సినిమా. తెలుగులో పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చిన ఏ అరంగేట్ర హీరో కూడా చేయని సాహసాలు చేశాడు వరుణ్. ‘ముకుంద’ లాంటి లవ్ స్టోరీతో హీరోగా పరిచయమయ్యాడు. ‘కంచె’ లాంటి మరో విభిన్నమైన సినిమా చేశాడు. సాధారణంగా కొత్త హీరోలు మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాక ప్రయోగాల మీద పడతారు. కానీ వరుణ్ దీనికి భిన్నం. ప్రయోగాలు చేసి.. ఇప్పుడు మాస్ హీరోగా నిరూపించుకునే పనిలో పడ్డాడు. పూరి స్టయిల్ ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ చేస్తున్న వరుణ్ ఎలా పెర్ఫామ్ చేశాడో చూడాలి. ఇక హీరోయిన్ దిశా పటానికి ఇదే తొలి సినిమా. ఒంపుసొంపులకు లోటేమీ లేని ఈ భామ.. తొలి సినిమా సక్సెస్ అయితే టాలీవుడ్ లో జెండా ఎగరేసేద్దామని చూస్తోంది. ఇక నిర్మాత సి.కళ్యాణ్ సంగతి చూస్తే.. పెద్ద బడ్జెట్ లో ఆయన చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. అందుకే ఈ సినిమా ఆయనకూ కీలకమే. మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్, సినిమాటోగ్రాఫర్ పి.జి.విందా కూడా ‘లోఫర్’ మీద భారీ ఆశలతో ఉన్నారు. మరి వీళ్లందరి ఆశల్ని ‘లోఫర్’ నెరవేరుస్తుందో లేదో చూడాలి.