Begin typing your search above and press return to search.
లోఫర్ బాగానే లాగాడు కానీ..
By: Tupaki Desk | 19 Dec 2015 6:44 AM GMTటాక్ ఎలా ఉన్నప్పటికీ ‘లోఫర్’ ఫస్ట్ డే కలెక్షన్లు పర్వాలేదనిపించాయి. పూరి జగన్నాథ్-వరుణ్ తేజ్ ల కాంబినేషన్ క్రేజ్ కారణంగా తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు రూ3.42 కోట్ల షేర్ వసూలవడం విశేషం. వరుణ్ లాంటి అప్ కమింగ్ హీరో సినిమాకు ఈ మాత్రం కలెక్షన్లు రావడం గొప్ప విషయమే. నైజాం ఏరియాలో రూ.1.22 కోట్ల షేర్ వసూలైంది. సీడెడ్ ఏరియాలో రూ.50 లక్షల కలెక్ట్ చేసింది లోఫర్. ఆంధ్రాలోని అన్ని ఏరియాలూ కలిపి రూ.1.72 కోట్ల షేర్ వసూలైంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు వసూళ్లు అటు ఇటుగా రూ.4 కోట్ల దాకా ఉన్నాయి.
ఐతే యుఎస్ లో మాత్రం లోఫర్ పరిస్థితి ఏమంత బాగా లేదు. విడుదలకు ముందు రోజు ప్రిమియర్స్ - ఫస్ట్ డే షోస్ కలిపి రూ.10 లక్షల లోపే వసూలైంది. అక్కడంతా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల మీదే ఆధారపడి ఉంటుంది. దీంతో యుఎస్ బయ్యర్ కు భారీ నష్టాలు తప్పేలా లేవు. ఫస్ట్ డే వరకు వసూళ్లు బానే ఉన్నప్పటికీ నెగెటివ్ టాక్ కారణంగా రెండో రోజు నుంచి కలెక్షన్లు డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల ఫస్ట్ వీకెండ్ లో రూ.10 కోట్ల మార్కును కూడా అందుకునే అవకాశం లేదు. ఈ సినిమాకు రూ.17 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్లు సమాచారం. ‘లోఫర్’ ఆ మార్కును అందుకోవడం దాదాపు అసాధ్యమే.