Begin typing your search above and press return to search.
వరుణ్ తేజ్ కు మిగిలేది వారమే!!
By: Tupaki Desk | 11 Nov 2015 3:51 AM GMTమంచి సినిమాలంటున్నారు.. కాని వారం రోజులు మాత్రమే ఛాన్సిస్తున్నారు. అలాగైతే ఆ కుర్రాడు ఏం చేస్తాడు చెప్పండి? మెగా లెగసీ వగైరా వగైరాలన్నీ ఫస్టు రెండు రోజులూ అభిమానులు కోకొల్లలుగా ధియేటర్లకు రావడానికి ఉపయోగపడతాయే తప్పించి.. ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్సు రావాలంటే మాత్రం.. ఈరోజుల్లో పక్కన ఇంకో సినిమా పోటీ ఉండకూడదు. అలా ఉంటే ఖేల్ కతమ్.
అందుకే కదా.. మన మహేష్ - చరణ్ వంటి స్టార్లు హ్యాపీగా రెండు వారాల గ్యాపులతో సినిమాల రిలీజ్ లను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం అందరి దృష్టీ.. మాస్ అవతారం ఎత్తిన 'లోఫర్' వరుణ్ తేజ్ గురించే. పూరి జగన్ సినిమాతో దూసుకొస్తున్నాడంటే.. ఖచ్చితంగా మాస్ కోసం బీభత్సమైన స్కెచ్ వేసుకొని వచ్చాడనమాట. ఇంతకీ ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు మరి? డిసెంబర్ 25.. జనవరి 8.. లేక 14న.. ఈ నాలుగు డేట్లలో ఒకటి కాయం అంటున్నారు. వాటిల్లో క్రిస్మస్ ను టార్గెట్ చేస్తే.. చిన్న చిన్న సినిమాలైన మామ మంచు అల్లుడు కంచు వంటి బాపత్తుతో పోటీ పడాలి. తరువాత వస్తే.. ఎన్టీఆర్ - బాలయ్య లు క్యూలో ఉన్నారు.
అసలు ఆ మూడు తేదీల్లో ఎప్పుడొచ్చినా కూడా వరుణ్ తేజ్ కు దొరికేది వారమే. హిట్ టాక్ వచ్చినా కూడా వారం మాత్రమే ఖాళీ ఉంటే కోట్లకు కోట్లు పిండేసుకోవటం కష్టం. చక్కగా రెండు వారాలు దొరికితే.. మనోడు తన కెరియర్ లో తొలి సూపర్ హిట్ కొట్టే ఛాన్సుంటుంది. కేవలం ఓపెనింగ్ డే పొగడ్తలే కాకుండా.. క్లోజింగ్ డే రోజున ప్రాఫిట్లు చూపించి మరీ బ్లాక్ బస్టర్ అని దండేయించుకోవచ్చు. చూద్దాం మరి వరుణ్ తేజ్ కు ఎలా సెట్ చేస్తారో!!