Begin typing your search above and press return to search.
‘లోఫర్’ దెబ్బ మామూలుది కాదు
By: Tupaki Desk | 12 Jan 2016 5:30 AM GMT‘ఎ పూరి జగన్నాథ్ ఎమోషన్’.. అంటూ రెండు, మూడు వారాల్లోనూ ‘లోఫర్’ టీవీ ప్రకటనలతో పబ్లిసిటీ ఓ రేంజిలో చేశారు. పూరి జగన్నాథ్ కూడా కాలికి బలపం కట్టుకుని ఛానెళ్లన్నీ తిరిగేశాడు. సినిమా గురించి చాలా ముచ్చట్లు చెప్పాడు. కానీ ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఫలితం లేకపోయింది. కలెక్షన్లు పికప్ అవ్వలేదు. ఓ మోస్తరు ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ఈ సినిమా చివరికి డిజాస్టర్ గానే మిగిలింది. ఫుల్ రన్ లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.11.65 కోట్లు మాత్రమే షేర్ కలెక్ట్ చేసి బయ్యర్లకు భారీ నష్టాలే మిగిల్చింది. గ్రాస్ వసూళ్లు కూడా రూ.20 కోట్ల మార్కు దగ్గరే ఆగిపోయాయి.
గత కొన్నేళ్లలో పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డు దారుణంగా ఉన్నప్పటికీ ‘టెంపర్’తో కొంచెం పవర్ చూపించడం, వరుణ్ లాంటి యంగ్ హీరోతో సినిమా తీయడం చూసి.. బయ్యర్లు ‘లోఫర్’ మీద పెద్ద పెట్టుబడులే పెట్టారు. దీనికి వరల్డ్ వైడ్ రూ.19 కోట్ల దాకా బిజినెస్ అయింది. కానీ అందులో 60 శాతం మాత్రమే వెనక్కి వచ్చింది. నైజాం ఏరియాలో రూ.6 కోట్ల దాకా రైట్స్ అమ్మితే అక్కడ రూ.3.54 కోట్లు మాత్రమే షేర్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10.5 కోట్లు మాత్రమే షేర్ రాబట్టింది ‘లోఫర్’. గ్రాస్ రూ.17 కోట్ల దాకా వచ్చింది. దీనికి ముందు పూరి-సి.కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘జ్యోతిలక్ష్మీ’కి కూడా బయ్యర్లకు కొంత వరకు నష్టాలు తప్పలేదు. కానీ అది చిన్న బడ్జెట్ సినిమా కావడంతో అవి చెప్పుకోదగ్గ నష్టాలుగా కనిపించలేదు. కానీ ‘లోఫర్’ మాత్రం బయ్యర్లను గట్టి దెబ్బే కొట్టింది.