Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ వేళ రచయితగా మారిన నటి

By:  Tupaki Desk   |   6 April 2020 8:10 AM GMT
లాక్ డౌన్ వేళ రచయితగా మారిన నటి
X
కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. దీంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఖాళీగా ఉంటున్న ఈ సమయాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తున్నారు.

చాలా మంది నటీనటులు ఈ లాక్ డౌన్ వేళ కుటుంబంతో హాయిగా గడుపుతున్నారు. పిల్లలతో కలిసి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు ఆరోగ్యం, ఫిట్ నెస్ పై దృష్టి సారిస్తుండగా.. మరికొందరు పుస్తకాలు చదువుతూ రచనలు చేస్తున్నారు. మరికొందరు ఈ ఖాళీ సమయంలో స్క్రిప్ట్ లు రాయడంపై దృష్టి సారిస్తున్నారు.

తాజాగా దక్షిణాది ప్రముఖ హీరోయిన్ నిత్యమీనన్ లాక్ డౌన్ ఖాళీ సమయంలో పెన్ను పట్టారు. ఖాళీగా ఉన్న తాను తన చుట్టూ జరుగుతున్న విశేషాలను గమనిస్తున్నానని.. నా మనసులో వచ్చిన ఆలోచనలను స్క్రిప్టులుగా మలుస్తున్నానని తెలిపింది. ప్రస్తుతం కథలు అభివృద్ధి చేస్తున్నానని నిత్యామీనన్ తెలిపింది.

ఇప్పటివరకు హీరోయిన్ గా బిజీగా ఉండేదానినని.. అందుకే కథలు, స్క్రిప్ట్ లు చేయడానికి సమయం ఉండేది కాదని నిత్యామీనన్ తెలిపింది. కానీ ఇప్పుడు ఖాళీ సమయాన్ని అంతా కథలు రూపొందించడానికే తీసుకుంటున్నానని తెలిపింది. ఇది నాకు చాలా స్వేచ్ఛగా అనిపిస్తోందని.. కొత్త భాష, కొత్త సంగీతం, పాటలు నేర్చుకుంటున్నాని తెలిపింది.

కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు అందరం ఇంట్లో ఉండడం అవరసమరని నిత్య మీనన్ తెలిపింది. మనం మళ్లీ బిజీగా మారడానికి చాలా సమయం పడుతుందని.. ఈ ఖాళీ సమయాన్ని తాను ఇలా కథలు రాయడానికి వాడుకుంటున్నానని తెలిపింది.