Begin typing your search above and press return to search.
ఏపీలో థియేటర్లకు తాళాలు.. ఎగ్జిబిటర్ సెక్టార్ కుదేలైనట్లేనా..?
By: Tupaki Desk | 26 Dec 2021 11:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు - థియేటర్ల మూసివేత అంశాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి. సినిమా టికెట్ ధరలు నియంత్రిస్తూ ప్రభుత్వం జీవో నెం.35 జారీ చేసిన నేపథ్యంలో మొదలైన రచ్చ.. ఇంకా కొనసాగుతూనే ఉంది. టికెట్ ధరలు తగ్గింపు అంశం మీద హైకోర్టులో విచారణ జరుగుతుంటే.. మరోవైపు నిబంధనలు అతిక్రమించిన థియేటర్లను సీజ్ చేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇంకోవైపు ప్రస్తుత ధరలతో నడపలేమంటూ స్వచ్ఛందంగా సినిమా హాళ్లకు తాళాలు వేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లపై జాయింట్ కలెక్టర్లు - రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోన్న సినిమా హాళ్లకు నోటీసులు జారీ చేసి సీజ్ చేస్తున్నారు. మరికొన్ని థియేటర్లకు జరిమానా విధిస్తున్నారు. కృష్ణా - విజయనగరం జిల్లాలో ఇప్పటికే పలు థియేటర్లు మూతపడ్డాయి. ఫాం-బి రెన్యువల్ లేదనే కారణంతో పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం 14 థియేటర్ లలో సినిమాల ప్రదర్శనలు నిలిపివేశారు.
అలానే ప్రకాశం జిల్లాలో బీ-ఫామ్ తో పాటు లైసెన్సు రెన్యువల్ లేని 28 థియేటర్ల యజమానులకు జేసీ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. చిత్తూరు జిల్లా పీలేరులో మూడు థియేటర్లకు రూ.36వేల చొప్పున జరిమానా విధించారని తెలుస్తోంది. కాణిపాకంలో 30ఏళ్లుగా నడుస్తున్న ఓ థియేటర్.. ఆలయ భూముల్లో ఉందనే కారణంతో అధికారులు రెన్యువల్ నిరాకరించడంతో మూతపడింది. మదనపల్లెలో లైసెన్సు గడువు ముగిసినా రెన్యువల్ చేసుకోకుండా సినిమాలు ప్రదర్శిస్తున్నారని నోటీసులు జారీ చేసి, జరిమానా విధించారు.
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సినిమా టికెట్ ధరలతో థియేటర్లు నిర్వహించలేమని యజమానులు స్వచ్ఛందంగా సినిమా హాళ్లకు తాళాలు వేస్తున్నారు. 20ఏళ్ల క్రితం నాటి ధరలతో ఇప్పుడు థియేటర్స్ నడపలేమని పేర్కొంటున్నారు. జీవో నెం.35 ప్రకారం రూ.5 - రూ.10 - రూ.15 లతో సినిమాలు నడపలేక.. తాత్కాలికంగా థియేటర్లు మూసివేస్తున్నట్లు గేటు బయట బోర్డులు పెడుతున్నారు.
నెలవారీ కరెంట్ బిల్లులే వేలల్లో ఉంటాయిని.. నెలకు సిబ్బంది జీతభత్యాలకు లక్షలు ఖర్చు అవుతాయని.. ఇప్పుడున్న టికెట్ రేట్లతో వర్కౌట్ అవదని చెబుతున్నారు. కరోనా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత జనాలను ఆకర్షించడం కోసం థియేటర్లలో అధునాతన సౌకర్యాలు కల్పించడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టామని.. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో సినిమాలు ప్రదర్శిస్తే అప్పులపాలవ్వడం ఖాయమని కొందరు చేతులెత్తేస్తున్నారు.
ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్ కలిగిన నెల్లూరు - సూళ్లూరు పేట జాతీయ రహదారిపై ఉన్న వి-ఎపిక్ థియేటర్ ని క్లోజ్ చేయడం గమనార్హం. ప్రభుత్వం నిర్దేశించిన టికెట్ ధరలకు అనుగుణంగా థియేటర్లు నడపడం సాధ్యం కాదని.. అందువల్ల కొన్ని రోజులపాటు థియేటర్ ను మూసివేస్తున్నామని యాజమాన్యం ప్రకటించింది.
తూర్పుగోదావరి జిల్లాలో 134 థియేటర్లు ఉండగా.. గ్రామ పంచాయతీల పరిధిలోని 57 థియేటర్లను ఇప్పటికే మూసివేశారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల, ప్రభుత్వం ఇచ్చిన రేట్ల ప్రకారం థియేటర్‌లను నడపడం తమ వల్ల కాదని.. కావున తాత్కాలికంగా మూసివేస్తున్నామని హాలు ముందు బోర్డులు పెడుతున్నారని తెలుస్తోంది.
ఇలా ప్రభుత్వం కొన్ని థియేటర్లను సీజ్ చేస్తుంటే.. మరికొన్ని సినిమా హాళ్లు స్వచ్ఛందంగా మూతబడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇదిలాగే కొనసాగితే ఏపీలో ఎగ్జిబిటర్ సెక్టార్ కుదేలైపోయినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా టికెట్ల అంశం మీద పునరాలోచించాలని సినీ ప్రముఖులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి త్వరలోనే ఏపీ సర్కారు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి. రాబోయే సంక్రాంతి సీజన్ లో పెద్ద సినిమాల విడుదలలు ఉన్నాయి. అప్పటిలోపే ఈ వ్యవహారం ఓ కొలిక్కి వస్తే బాగుంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.