Begin typing your search above and press return to search.

రీ క్రియేషన్‌ లో లాజిక్‌ మిస్సయిన 'జాను'

By:  Tupaki Desk   |   9 Feb 2020 1:30 AM GMT
రీ క్రియేషన్‌ లో లాజిక్‌ మిస్సయిన జాను
X
తమిళ సెన్షేషనల్‌ హిట్‌ మూవీ ‘96’ను తెలుగులో జానుగా రీమేక్‌ చేశారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జానుకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. రీమేక్‌ వద్దన్న వారే బాగా తీశారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. తమిళ 96 మ్యాజిక్‌ ను రీ క్రియేట్‌ చేయడం దాదాపు అసాధ్యం అంటూ చాలా మంది అనుకున్నారు. కాని దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ 96 లో ఉన్న మ్యాజిక్‌ ను జాను ద్వారా రీ క్రియేట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాడని చెప్పుకోవచ్చు. కాని మ్యాజిక్‌ రీ క్రియేషన్‌ లో చిన్న చిన్న లాజిక్‌ లను అతడు మిస్‌ అయ్యాడు.

ఒరిజినల్‌ వర్షన్‌ లో హీరో హీరోయిన్‌ 1996 సంవత్సరంలో పదవ తరగతి చదువుతూ ఉంటారు. ఇక తెలుగుకు వచ్చేప్పటికి హీరో హీరోయిన్‌ లుగా నటించిన శర్వా మరియు సమంతల వయసును దృష్టిలో పెట్టుకుని 2004 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్నట్లుగా చూపించారు. అంటే దాదాపుగా ఎనిమిది సంవత్సరాల తేడా. ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఎన్నో టెక్నికల్‌ అద్బుతాలు జరిగాయి.

ముఖ్యంగా టెలీకమ్యూనియేషన్‌ మరియు శాటిలైట్‌ రంగంలో అద్బుతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 2000 సంవత్సరం నుండి వచ్చిన మార్పును ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని 96లో ఎలా ఉండేదో అలాగే 2004 సంవత్సరంలో కథ నడుస్తున్నా కూడా అవే పరిస్థితులను చూపించారు. అంటే 1996లో టెక్నాలజీ ఎలా ఉండేది.. అప్పుడు టీవీలు ఎలా ఉన్నాయి.. టీవీలో కార్యక్రమాలనే 2004 సంవత్సరంకు చెందిన సీన్స్‌ లో కూడా చూపించారు.

రీ క్రియేషన్‌ చేసే క్రమంలో దర్శకుడు ఉన్నది ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేశాడు. అతడు తమిళ దర్శకుడు కాబట్టి అతడిది తప్పేం లేదు. దిల్‌ రాజు టీం అతడిని కాస్త గైడ్‌ చేసి ఆ సమయంలో తెలుగు రాష్ట్రంలో టెక్నాలజీ పరిస్థితిని అతడికి తెలియజేస్తే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తానికి లాజిక్‌ మిస్‌ అయినా మ్యాజిక్‌ మాత్రం రిపీట్‌ అయినందుకు ఇప్పుడు ఆ లాజిక్‌ గురించి ఎవరు పట్టించుకోక పోవచ్చు.