Begin typing your search above and press return to search.

లక్ష్మిస్ ఎన్టీఆర్ కు లాజిక్ ముహూర్తం

By:  Tupaki Desk   |   11 March 2019 8:20 AM GMT
లక్ష్మిస్ ఎన్టీఆర్ కు లాజిక్ ముహూర్తం
X
ఇక పెద్దగా అనుమానాలు లేనట్టే. సెన్సార్ కు ఎప్పుడు వెళ్ళేది తప్ప లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో అంతా ఓపెన్ అయిపోయింది. 22న విడుదలను మరోసారి ఖాయం చేస్తూ వర్మ ఇందాకా ట్వీట్ చేశాడు. అయితే దీనికో విచిత్రమైన లాజిక్ పెట్టాడు. అదేంటంటే నిన్న ఎన్నికల ప్రకటన వచ్చేసింది. ఏప్రిల్ 11 సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే వేడి రాజుకుంది. రాజకీయ పార్టీలకు ఊపిరి ఆడటం లేదు. నెల రోజులు చాలా తక్కువ టైం కాబట్టి కిందా మీద పడుతున్నారు.

ఈ పాయింట్ నే పట్టుకున్నాడు వర్మ. విడుదలవుతున్న తేదీ 22 ప్లస్ ఎన్నికలు జరిగే తేదీ 11 ప్లస్ ఫస్ట్ డే మొదటి ఆట ప్రదర్శించే టైం 12 మొత్తం కలిపి 9 వస్తుందని చెబుతున్నాడు. ఎలా అంటే 2+2+1+1+1+2 కూడితే తొమ్మిది వస్తుంది కదా. ఇందులో విశేషం ఏంటంటే 9 ఎన్టీఆర్ లక్కీ నెంబర్ అనే సంగతి అందరికి తెలిసిందే. ఈ రకంగా వర్మ ముహూర్తంని కూడా వాడేసుకున్నాడు

అయితే ఇలా విడివిడిగా సంఖ్యలను కూడితే తొమ్మిది వస్తుంది. అలా కాకుండా డేట్ మొత్తం తీసుకుని యాడ్ చేస్తే నెంబర్ మారిపోతుంది. ఇదంతా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వర్మ ప్లాన్ చేసుకున్న మార్కెటింగ్ స్ట్రాటజీ తప్ప మరొకటి కాదు. ఇప్పటి నుంచి చూసుకుంటే విడుదలకు కేవలం 11 రోజుల సమయం మాత్రమే ఉంది. ఉదయం 12కి ఫస్ట్ షో అన్నాడు కాబట్టి సంప్రదాయం ప్రకారం 8.45కు వేసే ఆట లేనట్టేగా. ముందు రోజు ప్రీమియర్ షో వేసే ఆలోచన కూడా వర్మకు ఉన్నట్టు లేదు. తన నిర్మాణంలో వచ్చిన గత చిత్రం భైరవ గీతకు వేశాడు కానీ ఆఫీసర్ తరహాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడాలంటె రిలీజ్ రోజు 12 దాకా వెయిట్ చేయాల్సిందే