Begin typing your search above and press return to search.

అదిరిపోయే స్టొరీ లైన్ తో విజయ్, లోకేష్ సినిమా

By:  Tupaki Desk   |   17 Jan 2023 3:30 AM GMT
అదిరిపోయే స్టొరీ లైన్ తో విజయ్, లోకేష్ సినిమా
X
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ నెక్స్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ విజయ్ 67వ సినిమాగా తెరకెక్కుతుంది. లోకేష్ యూనివర్స్ లో భాగంగా భారీ బడ్జెట్ తో మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ మూవీ ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, అనిల్ కపూర్, బాబీ డియోల్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. అలాగే విజయ్ కి జోడీగా త్రిష, కీర్తి సురేష్ నాటించబోతున్నారు.

ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యుల్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలో ఈ మూవీ సెకండ్ షెడ్యుల్ స్టార్ట్ అవుతుంది. భారీ తారాగణంతో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.

దీనికి కారణం విజయ్, లోకేష్ కలయికలో మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాబోతున్న సినిమా కావడం ఒకటైతే, లోకేష్ యూనివర్స్ లో భాగంగా ఖైది, విక్రమ్ ఫ్రాంచైజ్ లో భాగంగా ఈ మూవీ రాబోతుంది. ఈ కారణంగా విజయ్ 67 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చిన వారసుడు సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఈ నేపధ్యంలో విజయ్ నెక్స్ట్ సినిమాపై ఫ్యాన్స్ కూడా చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన స్టొరీ లైన్ తాజాగా బయటకొచ్చింది. చిన్న వయస్సులో ఓ టీ స్టాల్ లో టీలు అమ్ముకునే హీరో భయంకరమైన గ్యాంగ్ స్టార్ గా ఎలా మారాడు. అతను గ్యాంగ్ స్టార్ గా మారడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనేది ఈ మూవీలో కథాంశంగా ఉండబోతుందని తెలుస్తుంది. కథాంశం బట్టి ఈ స్టొరీ లైన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రలో విజయ్ కనిపించబోతున్నాడని అర్ధం అవుతుంది. దీనిని ఖైది, విక్రమ్ సినిమాలకి లింక్ చేసి కథాంశం నెక్స్ట్ పార్ట్ కి కొనసాగింపుగా ఎండింగ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.