Begin typing your search above and press return to search.

'రాంచరణ్' తో మూవీ పై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్!!

By:  Tupaki Desk   |   3 Jan 2021 11:16 PM IST
రాంచరణ్ తో మూవీ పై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్!!
X
కోలీవుడ్ సంచలన డైరెక్టర్లలో యంగ్ టాలెంటెడ్ లోకేష్ కనగరాజ్ ఒకడు. లోకేష్ తీసిన రెండు సినిమాలు మానగరం, ఖైదీ రెండు కూడా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు లోకేష్ తను తెరకెక్కించిన మూడో సినిమా మాస్టర్ విడుదల గురించి వెయిట్ చేస్తున్నాడు. Ee సినిమాలో ఇళయదళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు. ఇక లోకేష్ ప్రస్తుతం లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా విక్రమ్ అనే సినిమా రూపొందిస్తున్నాడు. అతని సినిమాల లైన్ అప్ చూస్తుంటే ప్రస్తుతం మార్కెట్ లో లోకేష్ పేరు బాగానే వినిపిస్తుంది. అంతేగాక డిమాండ్ కూడా ఎక్కువే అని చెప్పవచ్చు. అయితే తెలుగులో కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఒక ప్రాజెక్ట్ లోకేష్ డైరెక్ట్ చేయనున్నట్లు ఓకే చేసాడు. కానీ అది ఏ సినిమా? ఎవరితో? అనేవి తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. లోకేష్ కనగరాజ్‌తో మెగాపవర్ స్టార్ రాంచరణ్ లేదా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేస్తారని గతంలో పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే వాటి గురించి స్పష్టత రానుంది. తాజాగా లోకేష్ చెప్పిన దాని ప్రకారం.. అతను చాలామంది యాక్టర్లతో చర్చలు జరిపాడట. అందులో ఒకడు రాంచరణ్, అలాగే ఒక స్క్రిప్ట్ కూడా వివరించాడట. అయితే ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీగా ఉన్నారు. ఇక ఇద్దరూ కూడా ప్రస్తుత సినిమాలు కంప్లీట్ చేసి ఫ్రీ అయ్యాక ఫైనల్ స్క్రిప్ట్ రాంచరణ్ కు వినిపిస్తానని లోకేష్ క్లారిటీ ఇచ్చాడు. ఇదే గనక నిజమైతే.. రాంచరణ్, లోకేష్ కలయికలో వచ్చే సినిమా సంచలనమే అవుతుంది. కానీ అలా అవుతుందా లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మాస్టర్ సూపర్ హిట్ అయితే లోకేష్ కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఆఫర్లను అందుకుంటాడు. మరి కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు వేరే బాషా హీరోలతో సినిమాలు చేస్తాడా లేదా అనేది చూడాలి.