Begin typing your search above and press return to search.
కమల్ డైరెక్టర్ సినిమాలో క్రేజీ క్రికెటర్?
By: Tupaki Desk | 11 Nov 2022 3:30 PM GMT`విక్రమ్` మూవీతో సంచలనం సృష్టించిన తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ త్వరలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తో ఓ భారీ యాక్షన్ డ్రామాని తెరపైకి తీసుకురానున్న విషయం తెలిసిందే. ఇది విజయ్ నటించనున్న 67వ ప్రాజెక్ట్ లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో ఈ మూవీని కూడా తెరకెక్కించే అవకాశం వుందని, ఈ మూవీలో హీరో విజయ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.
ఇదిలా వుంటే ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తొలి సారి `ధోనీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ని స్థాపించి తమిళ ఇండస్ట్రీలో సినిమాలు నిర్మించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. తమిళంలో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లకు ధోనీ శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించిన ధోనీ ఈ ప్రాజెక్ట్ లని తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారట. అయితే మహేంద్ర సింగ్ ధోనీ కూడా నటుడిగా రంగ ప్రవేశం చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
లోకేష్ కనగరాజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా త్వరలో తెరపైకి రానున్న విజయ్ 67 ప్రాజెక్ట్ ద్వారా ఎం.ఎస్. ధోనీ నటుడిగా కీలక పాత్రలో టెర్రిఫిక్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ని త్వరలోనే చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ ప్రాజెక్ట్ అయితేనే తన ఎంట్రీకి కరెక్ట్ లాంచింగ్ ప్రాజెక్ట్ అని ఎం.ఎస్. ధోనీ కూడా భావిస్తున్నాడట.
ఆ కారణంగానే విజయ్ నటించనున్న 67వ ప్రాజెక్ట్ ని ధోనీ ఎంచుకున్నాడని ఇన్ సైడ్ టాక్. `విక్రమ్`తో సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ కి తెర తీసిన లోకేష్ కనగరాజ్ ఇందులో భాగంగానే `ఖైదీ 2`, విజయ్ 67 ప్రాజెక్ట్ లని త్వరలో తెరపైకి తీసుకురాబోతున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే విజయ్ 67కు సంబంధించిన అప్ డేట్ ని లోకేష్ కనగరాజ్ అందించబోతున్నాడట.
ప్రస్తుతం వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న `వారసుడు` మూవీలో విజయ్ నటిస్తున్న విషయం తోలిసిందే. దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ రిలీజ్ తరువాతే లోకేష్ కనగరాజ్ ... విజయ్ తో చేయనున్న 67వ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నాడు. అప్పుడే ఈ ప్రాజెక్ట్ లో ఎం.ఎస్. ధోనీ నటిస్తాడా? .. లేదా? అనే విషయంలో క్లారిటీ రానుందని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.