Begin typing your search above and press return to search.

మాస్టర్ డైరెక్టర్ మరో మూవీ లైనప్.. ఎవరితో అంటే?

By:  Tupaki Desk   |   15 Feb 2021 10:30 AM GMT
మాస్టర్ డైరెక్టర్ మరో మూవీ లైనప్.. ఎవరితో అంటే?
X
తమిళ యువదర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టరుగా మారాడు. తీసింది మూడు సినిమాలే అయినా బాక్సాఫీస్ దగ్గర లోకేష్ సినిమాలు ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసాయో తెలిసిందే. అందుకే ఇప్పుడు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ఇతని మేకింగ్ స్టైల్ చూసి స్టార్ హీరోలే అవకాశాలు ఇస్తున్నారంటే అర్ధం చేసుకోవాలి లోకేష్ స్టామినా ఏంటో. నగరం సినిమాతో దర్శకుడుగా మారిన లోకేష్.. 2019లో ఖైదీ సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేశాడు. కార్తీ హీరోగా నటించిన ఆ మూవీ వందకోట్ల క్లబ్ లో చేరింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మాస్టర్ సినిమాతో సంచలనం సృష్టించాడు లోకేష్. ఇళయదళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మాస్టర్ మూవీ రెండువందల కోట్ల క్లబ్ లో చేరింది.

ఇక తన నాలుగవ సినిమాగా సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా చేస్తున్నాడు లోకేష్. థ్రిల్లింగ్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నిలిపేశారు. ఎందుకంటే కమల్ ఆల్రెడీ రెస్ట్ లో ఉండగా.. మే నెలలో తమిళనాడు జనరల్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఎలక్షన్స్ తర్వాత విక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. అయితే విక్రమ్ సినిమా లైన్ లో ఉండగానే లోకేష్.. తన తదుపరి సినిమాల గురించి చర్చిస్తున్నాడు. విక్రమ్ మూవీ ప్రారంభం అయ్యేలోపు లోకేష్ మరో సినిమా ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్ సర్కిల్స్ సమాచారం ప్రకారం.. ఆ సినిమాలో హీరోగా విజయ్ సేతుపతిని తీసుకునే అవకాశం ఉందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఏ కబురు వినిపిస్తాడో!