Begin typing your search above and press return to search.

క్యూట్‌ లాలీ పాప్‌ లవ్‌ స్టోరీస్‌ గ్లిమ్స్‌

By:  Tupaki Desk   |   13 March 2022 5:14 PM GMT
క్యూట్‌ లాలీ పాప్‌ లవ్‌ స్టోరీస్‌ గ్లిమ్స్‌
X
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించిన సుధాకర్‌ కోమాకుల హీరోగా 30 వెడ్స్‌ 21 యూట్యూబ్ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిన అనన్య హీరోయిన్‌ గా తెరకెక్కిన చిత్రం లాలీపాప్. ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ వీడియో ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. తెలుగుతో పాటు హిందీ.. తమిళం.. కన్నడం మరియు మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా ను విడుదల చేయబోతున్నారు.

పాన్ ఇండియా లెవల్‌ లో కాబోతున్న లాలీపాప్ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ వీడియో చాలా క్యూట్ గా ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. రెండు క్యూట్ ప్రేమ కథల తో ఈ సినిమా సాగుతుందని వీడియోలో పేర్కొన్నారు. ఈ సినిమాకు వినయ్ షణ్ముఖ దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే నమ్మకం తో మేకర్స్ ఉన్నారు.

సుధాకర్‌ కోమాకుల ఈమద్య కాలంలో హీరోగానే కాకుండా పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా చేసి నటుడిగా మంచి పేరును దక్కించుకున్నాడు. ఆయన్ను చూడగానే మన పక్కింటి కుర్రాడు అనే ఫీలింగ్‌ కలుగుతుంది. కనుక అతడి సినిమా అంటే సాదారణంగానే జనాల్లో ఆసక్తి కలుగుతుందని సోషల్‌ మీడియా టాక్‌ ఉంది.

ఇక హీరోయిన్‌ అనన్య ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో సెన్షేషన్ అనడం లో సందేహం లేదు. ఆమె నటించిన 30 వెడ్స్ 21 యూట్యూబ్‌ సిరీస్‌ సీజన్‌ 2 కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది. కనుక ఖచ్చితంగా లాలీ పాప్ కు ఆమె అదనపు ఆకర్షణ అనడం లో సందేహం లేదు. కాస్టింగ్‌ విషయంలోనే లాలీపాప్ మేకర్స్‌ సక్సెస్ అయ్యారు. దాంతో సినిమా కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుందని ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఒక యూనివర్శిల్‌ లవ్‌ స్టోరీ మూవీ కనుక తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలని నిర్ణయించారట. రెండు జంటల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా గ్లిమ్స్ వీడియో చూస్తుంటే అర్థం అవుతుంది.

ఆ ప్రేమ కథలు ఏ మజిలీ చేరుతాయి.. అసలు రెండు ప్రేమ కథల మద్య ఏమైనా సంబంధం ఉందా.. లేదంటే రెండు ప్రేమ కథలు కూడా ఒక్కటేనా అనే విషయాలు తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.