Begin typing your search above and press return to search.

'లాలీపాప్' మ్యూజిక్ వీడియో పాన్ ఇండియాలో!

By:  Tupaki Desk   |   8 March 2022 7:30 AM GMT
లాలీపాప్ మ్యూజిక్ వీడియో పాన్ ఇండియాలో!
X
పాన్ ఇండియా అనే పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. అదీ టాలీవుడ్ పాన్ ఇండియా సినిమా అంటే అంతా ఇంతా క్రేజ్ కాదు. తెలుగు సినిమా పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ అవుతుందంటే అసాధార‌ణ‌మైన బ‌జ్ క్రియేట్ అవుతుంది. దానికి త‌గ్గ‌ట్టు టాలీవుడ్ హీరోలు-మేక‌ర్స్ అదే స్థాయిలో ప్లానింగ్ చేస్తూ ముందుకు క‌దులుతున్నారు. సినిమా గ‌మ‌నాన్నే మార్చేస్తున్నారు.

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ఇప్పుడు మిగ‌తా భాష‌ల ప‌రిశ్ర‌మ‌ల‌కు స్పూర్తిగా నిలిచిందంటే అతిశ‌యోక్తి కాదు. తాజాగా 'లాలీపాప్' అంటూ ఓ పాన్ ఇండియా మ్యూజిక్ వీడియో కూడా పాన్ ఇండియా ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డానికి రెడీ అవుతోంది.

'ఏ జ‌ర్నీ ఆఫ్ టూ ల‌వ్ స్టోరీస్' అనే ఉప శీర్షిక‌తో ఈ 'లాలీపాప్' మ్యూజిక్ వీడియో తెలుగు..హిందీ.. త‌మిళం..క‌న్న‌డ‌..మ‌ల‌యాళ భాష‌ల్లో భాష‌ల్లో రిలీజ్ అవుతుంది. ఇమేజెస్ పార్కెంట్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ వీడియోని నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన విన‌సొంపైన మెలోడీ ట్రాక్ తో కూడిన టైటిల్ టీజ‌ర్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసారు.

బీచ్ వ్యూని ఎలివేట్ చేస్తూ కంపోజ్ చేసిన ట్యూన్ సంగీత ప్రియుల్ని ఆక‌ట్టుకుంటుంది. పోస్ట‌ర్ లోనూ మంచి క్రియేటివిటీ క‌నిపిస్తోంది.

ఈరోజు సాయంత్రం నాలుగు గంట‌ల‌కు అందులో న‌టిస్తున్న పాత్ర ధారుల్ని ప‌రిచయం చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేయ‌నున్నారు. వీడియోకి ప‌నిచేసిన సాంకేతిక బృందం పేర్లు బ‌య‌ట‌కు రానున్నాయి. ఈ మ్యూజిక్ వీడియోకి ఎవ‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కంపోజ‌రు ఎవ‌రు? త‌దిత‌ర వివ‌రాలు మ‌రికొన్నిగంట‌ల్లో బ‌య‌ట‌కు రానున్నాయి. మ్యూజిక్ వీడియో బాగుంటే ఆద‌ర‌ణ‌కి కొద‌వ‌లేదు. ఏ వీడియోలోనైనా క్రియేటివిటీ కీల‌క పాత్ర పోషిస్తుంది.

గ‌తంలో ఇలాంటి వీడియోలు ప్రాంతీయంగా రిలీజ్ అయ్యాయి గానీ పెద్దగా స‌క్సెస్ కాలేదు. ఏ వీడియో సాంగ్ లో నైనా క్రియేటివిటీ..యూనిక్ గా హైలైట్ అవ్వాలి. కంపోజింగ్ ఇక్క‌డ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. నేటి త‌రం ప‌ల్స్ ప‌ట్టుకుని చేయ‌గ‌లిగి ఉండాలి. మ‌రి 'లాలీపాప్' ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.