Begin typing your search above and press return to search.
లుక్ టాక్: షోమ్యాన్ లా ఉన్నాడు.. ఎవరీయన?
By: Tupaki Desk | 1 Jan 2022 4:30 PM GMTచూడటానికి షో మ్యాన్ లా .. రంభల హార్ట్స్ లో రెమోలా.. గుండెలు పిండే రౌడీ బోయ్ లా ఉన్నాడు... ఇంతకీ ఎవరీయన? అంటారా? .. ది గ్రేట్ విజయ్ దేవరకొండ .. అనూహ్యంగా మారిన ఆ రూపం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదంతా `లైగర్` డైరెక్టర్ పూరి చలువే. చరణ్ - బన్ని- ప్రభాస్ - ఎన్టీఆర్ లాంటి టాప్ హీరోల లుక్ ని మార్చేసిన పూరి దృష్టి పూర్తిగా విజయ్ పైనే ఫోకస్ అయ్యింది. నితిన్- రామ్ తర్వాత ఆ ఛాయిస్ విజయ్ కి దక్కింది.
పాన్ ఇండియా మూవీ లైగర్ ని ప్రకటించింది మొదలు విజయ్ దేవరకొండ రేంజే మారిపోయింది. ఈ మూవీ కోసం అతడు ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడో పోస్టర్లు ఇటీవలే విడుదలైన టీజర్ లోనూ వెల్లడైంది. అతడు తన రూపాన్ని పూర్తిగా మార్చేశాడు. ఒక కోణంలో రోమియోలా.. రొమాంటిక్ బోయ్ లా కనిపిస్తూనే మరో కోణంలో యాక్షన్ కింగ్ లాగా కనిపిస్తున్నాడు.
మాజీ వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ తోనే లైగర్ లో తలపడబోతున్నాడు. అలాంటి కీలక ఎపిసోడ్ లో దేవరకొండను చూడటం అంటే గాళ్స్ కలల రాకుమారుడిని చూస్తున్నట్టే ఫీలవుతారేమో! లేటెస్ట్ గా కర్లీ హెయిర్ తో గళ్ల చొక్కాయ్ తొడుక్కుని దేహదారుఢ్యాన్ని కండల్ని ప్రదర్శిస్తున్నాడు. స్టైల్ గా గాగుల్స్ ధరించి షో మ్యాన్ లా గాళ్స్ కలల రాకుమారుడిలా కనిపిస్తున్నాడు. అందుకే బాలీవుడ్ నుంచి అనన్య పాండే.. జాన్వీ కపూర్.. కియరా అద్వాణీ .. సారా అలీఖాన్ లాంటి భామలు విజయ్ కి ఫిదా అయిపోతున్నారు. అతడు ఓకే అనాలే కానీ ఈ భామలంతా స్వయంవరం ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు! పాన్ ఇండియా మూవీ లైగర్ తో ఘనవిజయం అందుకుని అటుపై బాలీవుడ్ నిర్మాణ సంస్థల టై అప్ తో వరుస పాన్ ఇండియా సినిమాలు చేయాలని కలలు గంటున్న దేవరకొండ.. ఆశించినది నెరవేర్చుకుంటాడనే ఆశిద్దాం.