Begin typing your search above and press return to search.

చరణ్ ను చూస్తే పెదనాన్న.. బాబాయ్ గుర్తొస్తారు: వరుణ్ తేజ్

By:  Tupaki Desk   |   28 March 2022 4:20 AM GMT
చరణ్ ను చూస్తే పెదనాన్న.. బాబాయ్ గుర్తొస్తారు: వరుణ్ తేజ్
X
రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ నిన్న ఘనంగా జరిగాయి. చరణ్ ఒక సాలిడ్ బ్లాక్ బాస్టర్ కొట్టక చాలా కాలమైంది. ఆయన రేంజ్ కీ .. క్రేజ్ కి మామూలు హిట్ సరిపోదు. ఓ మాదిరి ఓపెవింగ్స్ సరిపోవు. సంచలన విజయం కావాలి .. కొత్త రికార్డులను తిరగరాసే వసూళ్లు కావాలి. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ చరణ్ కి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా తెచ్చిపెట్టింది. అయితే ఆ వెంటనే ఆయన బర్త్ డే రావడంతో చరణ్ .. ఆయన ఫ్యామిలీతో పాటు అభిమానులకు కూడా మరింత సంతోషాన్ని కలిగించింది. అందువల్లనే ఈ సారి ఆయన బర్త్ డే వేడుక 'ఆర్ ఆర్ ఆర్' సక్సెస్ ను కలుపుకుని జరిగింది.

ఈ వేదికపై వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. "మెగా అభిమానులందరికీ నమస్కారం. చరణ్ బర్త్ డే ఎప్పుడూ కూడా ఒక ఫెస్టివల్ లాగే జరుగుతుంది. ఈ సారి ఆ పండుగ ఒక రెండు రోజుల ముందుగానే వచ్చింది .. 'ఆర్ ఆర్ ఆర్' రూపంలో. అలాంటి ఒక గొప్ప సినిమాను .. గొప్ప సక్సెస్ ను చరణ్ కి ఇచ్చిన రాజుగారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తారక్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. చరణ్ కంటే నేను చాలా చిన్నవాడిని .. ఎప్పుడూ కూడా ఏడిపిస్తూ ఉండేవాడు. ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉండటం వలన నేను తనకి భయపడుతూ ఉండేవాడిని.

చరణ్ నన్ను తరుముతుంటే నేను చిరంజీవి గారి వెనక్కి వెళ్లి 'నన్ను కొడుతున్నాడు .. తిడుతున్నాడు' అని చెప్పేవాడిని. తాను హీరో అయిన తరువాత .. 'చిరుత' సినిమా చేసిన తరువాత ఆయనలో మెచ్యూరిటీ వచ్చేసింది. చిరంజీవి గారిలోని మెచ్యూరిటీ .. కల్యాణ్ బాబాయ్ లోని ముక్కుసూటితనం .. ఆ రెండు కలబోసుకున్న వ్యక్తిత్వం చరణ్ కి వచ్చింది. చరణ్ వంటి గొప్ప మనసున్న వారు బయట చాలా అరుదుగా ఉంటారు. ఆలాంటి అన్నయ్యకి నేను తమ్ముడిని అయినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను.

మెగాస్టార్ .. పవన్ బాబాయ్ .. చరణ్ ఎవరి బర్త్ డే వచ్చినా ఘనంగా నిర్వహిస్తున్న అభిమానులందరికీ, మా ఫ్యామిలీ తరఫున థ్యాంక్స్ చెబుతున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సాధారణంగా తన బర్త్ డేకి మనం గిఫ్ట్ ఇవ్వాలి .. ఈ సారి తను మనకి గిఫ్ట్ ఇచ్చాడు.

అదీ అల్లూరి సీతారామరాజు పాత్రలో. థియేటర్లో ఆయనను ఆ కాస్ట్యూమ్స్ లో చూడగానే నేను అన్నీ మర్చిపోయాను. తెరపై నాకు అల్లూరి సీతారామరాజు మాత్రమే కనిపించాడు. చరణ్ సినిమా .. సినిమాకి ఎదుగుతూ వస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో .. ఇతర రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా తాను ఎంతో పై స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక మాట చెప్పదలచుకున్నాను.

చరణ్ ను ఎవరైనా ఒక్క మాట మాట్లాడారంటే మీ అందరితో పాటు నేను అక్కడే ఉంటాను. ముందు మనతో మాట్లాడమని చెప్పండి .. ఆ తరువాత ఆయనతో మాట్లాడవచ్చు. లవ్ యూ ఆల్ .. సీయూ" అంటూ ముగించాడు.