Begin typing your search above and press return to search.
మినీ రివ్యూ: 'లూజర్ 2' ఎలా ఉందంటే..?
By: Tupaki Desk | 25 Jan 2022 12:34 PM GMTఓటీటీల హవా ప్రారంభమైన తర్వాత తెలుగులోనూ వెబ్ సిరీస్ లకు ఆదరణ దక్కుతోంది. అలాంటి వారిలో జీ5 డిజిటల్ వేదికలో స్ట్రీమింగ్ అయిన ''లూజర్'' వెబ్ సిరీస్ కూడా ఒకటి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా సిరీస్ కి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియదర్శి - శశాంక్ - కల్పిక - అని - పావని గంగిరెడ్డి - కోమలి ప్రసాద్ - షాయాజీ షిండే ప్రధాన పాత్రలు పోషించారు. మొదటి సీజన్ మంచి సక్సెస్ అవడంతో మేకర్స్ ఇప్పుడు సీజన్ -2 ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
'లూజర్ 2' సిరీస్ కు అభిలాష్ రెడ్డి కంకర - శ్రవణ్ మాదాల మరియు సాయి భరద్వాజ్ కలిసి కథ అందించారు. అభిలాష్ రెడ్డి & శ్రవణ్ మాదాల దర్శకత్వం వహించారు. స్పెక్ట్రమ్ మీడియా నెట్ వర్క్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సుప్రియ యార్లగడ్డ ''లూజర్'' సీజన్-2 ని నిర్మించారు. సాధారణంగా విజయవంతమైన చిత్రాలకు సీక్వెల్ లు రూపొందించడం చూస్తుంటాం. అయితే ఇప్పుడు తెలుగులో ఓ వెబ్ సిరీస్ కు రెండో సీజన్ వస్తుండటంతో దీనిపై ముందుగానే అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ''లూజర్ 2'' సిరీస్ ను జీ 5 ఓటీటీలో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కి పెట్టారు.
'లూజర్ 2' అనేది మూడు విభిన్న కథల ఆధారంగా రూపొందించబడిన పీరియాడికల్ డ్రామా. మొదటి సీజన్ ముగిసిన చోట నుంచే ఇది ప్రారంభమవుతుంది. గత సీజన్ లో సూరి యాదవ్(ప్రియదర్శి) రైఫిల్ షూట్ లో నేషనల్ ఛాంపియన్ గా ఎదగడం.. విల్సన్(శశాంక్) క్రికెట్ ప్లేయర్ నుంచి కోచ్ గా మారడం.. అలానే రూబీ(కల్పిక గణేష్) తన బ్యాడ్మింటన్ నుంచి పెళ్లి వరకు ఎదుర్కొన్న ఇబ్బందులను చూపించారు. సీజన్-2 లో సూరికి స్పోర్ట్స్ కోటాలో కొత్త ఉద్యోగం దొరికింది. రూహి షబానా తన భర్త ఇష్టానికి వ్యతిరేకంగా బ్యాడ్మింటన్ కోచ్ గా మారింది. ఇక విల్సన్ తన కొడుకును ఫాస్ట్ బౌలర్ గా రెడీ చేయడానికి బలవంతపు శిక్షణ ఇస్తుంటాడు. ఈ ముగ్గురూ తమ లైఫ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? వృత్తి పరంగా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి కొత్త సవాళ్ళను ఎదుర్కొన్నారు? వాటిని అధిగమించారా లేదా? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ప్రియదర్శి - శశాంక్ - కల్పికలతో పాటుగా ధన్యా బాలకృష్ణన్- షాఓయాజీ షిండే - యానీ - హర్షిత్ రెడ్డి - సూర్య - పావనీ గంగిరెడ్డి - రవి వర్మ - సత్య కృష్ణన్ - శ్రీను - టిప్పు - శిశిర్ శర్మ - తారక్ పొన్నప్ప తదితరులు ఈ సీజన్ లో సందడి చేశారు. ప్రియదర్శి - శశాంక్ - కల్పిక ముగ్గురూ ఇందులోనూ అద్భుతమైన నటన కనబరిచారు. ప్రధాన నటీనటుల ప్రామిసింగ్ పెరఫార్మెన్స్ తో పాటుగా సాయి శ్రీరామ్ మద్దూరి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ - నరేష్ రామదురై విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గత సీజన్ తో పోలిస్తే బెటర్ విజువల్స్ కనిపిస్తాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ వారి నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 'లూజర్ 2' ను తీశారు. అయితే గత సీజన్ లో ఉన్న స్ట్రాంగ్ ఎమోషన్స్ కనిపించకపోవడం ఇందులో నిరాశ పరిచే అంశాలో ఒకటి. అలానే అక్కడక్కడా కథనం రొటీన్ గా అనిపిస్తుంది. మొత్తం మీద మొదటి సీజన్ కంటే బెటర్ గా ఈ సీజన్ ని రూపొందించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.