Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: విన్నర్ లాగా అనిపిస్తున్న లూజర్
By: Tupaki Desk | 11 May 2020 11:30 AM GMTఈమధ్య ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు.. వెబ్ సిరీస్ లకు ప్రేక్షకుల్లో ఆదరణ పెరిగింది. దీంతో ప్రముఖ సంస్థలు వెబ్ సిరీస్ నిర్మాణం వైపు దృష్టి సారిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ వారు జి5 కోసం తాజాగా లూజర్ అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో ప్రియదర్శి శశాంక్.. కల్పిక..యాని ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 15వ తారీకు నుంచి జి 5 లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.
ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ క్లుప్తంగా చెప్పుకుంటే 1980 నుంచి 2000 సంవత్సరం వరకు ముగ్గురు క్రీడాకారుల జీవితంలో జరిగిన సంఘటనల సమాహారం. ప్రియదర్శి రైఫిల్ షూటింగ్ లో జోనల్ ప్లేయర్. అయితే ఆ స్పోర్ట్ కు అవసరమైన డబ్బు తన దగ్గర ఉండదు. శశాంక్ ఓ మంచి క్రికెటర్.. అయితే తన దుందుడుకు స్వభావం కారణంగా క్రికెట్ లో ఉన్నత స్థాయి కి చేరలేకపోతాడు. ఇక మరో అమ్మాయి బ్యాడ్మింటన్ ప్లేయర్. అయితే వాళ్ల నాన్న ఈ అమ్మాయి ఆడడానికి ఒప్పుకోడు.
ఈ ముగ్గురు అనుకోని పరిస్థితుల ద్వారా కలిస్తే ఏం జరుగుతుంది అనేది ఈ వెబ్ సిరీస్ లో ఉంటుందని ట్రైలర్ లో చూపించారు. వెబ్ సిరీస్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. "ఓడిపోవడం అంటే దారులు లేకపోవడం కాదు.. ఉన్న దారి వెతుక్కోలేకపోవడం" ఇలాంటి డైలాగ్స్ ఆసక్తికరంగా.. అర్థవంతంగా ఉన్నాయి. ఆలస్యం ఎందుకు... ట్రైలర్ పై ఒక లుక్కేయండి.