Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురి 'మహా' నమ్మకం వమ్ము

By:  Tupaki Desk   |   19 Oct 2021 4:31 AM GMT
ఆ ముగ్గురి మహా నమ్మకం వమ్ము
X
ఆర్‌ ఎక్స్ 100 వంటి సూపర్‌ హిట్‌ సినిమాను తీసిన వర్మ శిష్యుడు అజయ్ భూపతి మొదటి సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమా విడుదలైనప్పటి నుండే తన రెండవ సినిమా మహా సముద్రం అంటూ చెప్పుకొచ్చాడు. మహా సముద్రం సినిమా ను పట్టాలెక్కించేందుకు గాను దర్శకుడు అజయ్ భూపతి పడ్డ కష్టం ఆయన సన్నిహితులతో పాటు అందరికి బాగా తెలుసు. కథ మల్టీ స్టారర్ అవ్వడంతో పలువురు హీరోలు కథ వినడం నో చెప్పడం చేశారు. ఎంతో మంది యంగ్‌ హీరోలు ఆయన కథ విని ఆ తర్వాత పక్కకు పెట్టేశారు. ఒక్కరు ఇద్దరు సినిమా చేద్దాం అంటూ కొంత సమయం గడిపిన తర్వాత మళ్లీ సారీ చెప్పారు. అలాంటి సమయంలో శర్వానంద్‌ ఈ కథకు ఓకే చెప్పాడు. సెకండ్ హీరో ఎంపిక సమయంలో చాలా ఇబ్బందులు ఎదురు అయ్యాయి. చివరకు సిద్దార్థ్‌ ను ఎంపిక చేసి ఇద్దరికి సెట్‌ చేసి ఒక మంచి నిర్మాతను పట్టుకున్న అజయ్ భూపతి సినిమా మేకింగ్‌ విషయంలో మాత్రం ఎక్కువ కష్టపడలేదేమో అనిపిస్తుంది అంటూ రివ్యూవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మహాసముద్రం సినిమా పై అజయ్‌ భూపతి చాలా నమ్మకం పెట్టుకుని తెరకెక్కించాడు. మొదటి సినిమాతో సక్సెస్ దక్కించుకున్న అజయ్ రెండవ సినిమాను కూడా సక్సెస్ దక్కించుకుని టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్ గా మారాలని ప్రయత్నించాడు. కాని అనూహ్యంగా మహా సముద్రం ఆయనకు మహా నిరాశ మిగిల్చింది. ఇక మూడవ సినిమా ఆయన చేయాలంటే మరెంత కాలం వెయిట్‌ చేయాల్సి వస్తుందో చూడాలి. ఇక శర్వానంద్‌ ఈమద్య కాలంలో వరుసగా నిరుత్సాహ పర్చుతున్నాడు. ఈయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌ హిట్ దక్కించుకోక చాలా కాలం అయ్యింది. దాంతో మహా సముద్రంపై ఆయన పెట్టుకున్న మహా నమ్మకం కాస్త వమ్ము అయ్యింది. ఈ సినిమా కోసం శర్వానంద్‌ చాలానే కష్టపడ్డాడు. కెరీర్‌ లో మొదటి సారి ఒక విభిన్నమైన పాత్ర అంటూ ప్రచారం జరిగి అంచనాలు పెరిగాయి. కాని శర్వానంద్ అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. సోషల్‌ మీడియాలో శర్వానంద్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి కాని కమర్షియల్‌ బ్రేక్ మాత్రం రాలేదు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక చాలా ఏళ్ల తర్వాత బొమ్మరిల్లు సిద్దు తెలుగు ప్రేక్షకుల ముందుకు డైరెక్ట్‌ సినిమా తో వచ్చాడు. తెలుగు లో ఈయన నటించిన గత చిత్రాలు ఇప్పటికి గుర్తుండి పోతాయి. అలాంటి సిద్దు ఈ సినిమా తో కమ్‌ బ్యాక్ అనుకున్నాడు. కాని ఈ సినిమా తీవ్రంగా ఆయన్ను నిరాశ పర్చింది. సినిమా కు కమర్షియల్‌ సక్సెస్‌ దక్కాలి అంటే 14 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు అవ్వాలి. కాని మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమా కనీసం ఆరు కోట్ల రూపాయలను కూడా రాబట్టలేక పోయింది. పండుగ మరియు వీకెండ్‌ ను కూడా ఈ సినిమా వినియోగించుకోలేక పోయింది. ఈ సినిమాతో పాటు విడుదల అయిన మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్ మాత్రం మంచి వసూళ్లను నమోదు చేస్తోంది. మహా సముద్రం కమర్షియల్‌ సక్సెస్ అవ్వడానికి.. బ్రేక్ ఈవెన్‌ సాధించడానికి ఇంకా 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాల్సి ఉంది. కాని మొదటి నాలుగు అయిదు రోజుల్లో రాబట్టలేని వసూళ్లు ఇప్పుడు రాబట్టడం అసాధ్యం. కనుక ఈ సినిమా కమర్షియల్‌ గా ప్లాప్ అని చెప్పక తప్పదు అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. ఈ వసూళ్లు ఈ సినిమా పై మహా నమ్మకం పెట్టుకున్న వారికి చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి.