Begin typing your search above and press return to search.

స‌డెన్ గా క్లినిక్ కి వెళ్లి దొరికిపోయిన ప్రేమ గువ్వ‌లు

By:  Tupaki Desk   |   2 Nov 2019 9:09 AM GMT
స‌డెన్ గా క్లినిక్ కి వెళ్లి దొరికిపోయిన ప్రేమ గువ్వ‌లు
X
30 ప్ల‌స్ అర్జున్ క‌పూర్ కి 46 ఏజ్ మ‌లైకాతో ప్రేమ వ్య‌వ‌హారం ఆల్వేస్ హాట్ టాపిక్. బాలీవుడ్ టు టాలీవుడ్ ఇది హీటెక్కిస్తోంది. రెగ్యుల‌ర్ మీడియా క‌థ‌నాల‌తో ఉత్త‌రాది ద‌క్షిణాది అన్న తేడా లేకుండా ఈ ప్రేమ జంట‌కు పాపులారిటీ వ‌చ్చేసింది. ఆర్భాజ్ నుంచి విడిపోయిన మ‌లైకా ఆ త‌ర్వాత స‌ద‌రు కుర్ర హీరోతో ప్రేమ‌లో ప‌డ‌డంపై బాలీవుడ్ మీడియా స‌హా అన్ని మీడియాలు కోడై కూసాయి. ప్ర‌తిసారీ ఈ జంట విదేశీ ట్రిప్ లు.. సీక్రెట్ పార్టీలు బ‌య‌ట‌ప‌డ‌డంతో అది కాస్తా ర‌చ్చ‌యిపోయింది.

ఇక ఇదంతా పాత వ్య‌వ‌హారం అనుకుంటే కొత్త‌గా ఏం ఉంది అన్న డౌట్ రావొచ్చు. క‌చ్ఛితంగా కొత్త పాయింట్ ఒక‌టి ఉంది. ఈ జోడీ ఉన్న‌ట్టుండి ముంబై ర‌ద్దీ ఏరియాలోని ఓ క్లినిక్ నుంచి బ‌య‌టికి వ‌స్తూ కెమెరా కంటికి చిక్క‌డంతో ర‌క‌ర‌కాల స్పెక్యులేష‌న్స్ క‌నిపిస్తున్నాయి. అస‌లింత‌కీ మ‌లైకా ఎందుక‌ని డాక్ట‌ర్ ని క‌లిసింది? క్లినిక్ కి ఎందుక‌ని వెళ్లింది? అంత అవ‌స‌రం ఏమిటో! అంటూ ఆరాలు మొద‌లైపోయాయి. పైగా త‌న‌తో పాటే ప్రియుడు అర్జున్ క‌పూర్ కూడా క‌నిపించ‌డంతో సందేహాలు మ‌రింత‌గా ముదిరాయి.

మొత్తానికి ఏదో సంథింగ్ శుభ‌వార్త ఉందా? అంటూ గుస‌గుస‌లు మొద‌లైపోయాయ్. అయితే అలాంటిది ఉందా లేదా? అన్న‌ది ఆ జోడీ క‌న్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇప్ప‌టికైతే స్పెక్యులేష‌న్స్ మాత్ర‌మే. మ‌రోవైపు ఆ ఇద్ద‌రూ సినిమాల‌తో బిజీ బిజీ. అర్జున్ క‌పూర్ ప్ర‌స్తుతం పానిప‌ట్ అనే భారీ హిస్టారిక‌ల్ చిత్రంలో న‌టిస్తున్నాడు. మొహంజోదారో ఫేం అశుతోష్ గోవారిక‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌లైకా అరోరాఖాన్ త‌దుప‌రి స్పెష‌ల్ నంబ‌ర్ల‌లో ద‌ర్శ‌న‌మీయ‌నుంద‌ట‌. ఇదివ‌ర‌కూ ప‌టాకా మూవీలో `హ‌లో హ‌లో..` అంటూ సాగే పాట‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. మరోవైపు టీనేజీ త‌న‌యుడిని హీరోగా ప‌రిచ‌యం చేసేందుకు మ‌లైకా ఇప్ప‌టి నుంచే శ్ర‌ద్ధ తీసుకుంటోంద‌న్న స‌మాచారం ఉంది. ఆర్భాజ్-మ‌లైకా జంట సుపుత్రుడు అర్హాన్ ఖాన్ నూనూగు మీసాల టీనేజీలోకి అడుగు పెట్టేయ‌డంతో అది కాస్తా బాలీవుడ్ లో ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. మ‌లైకా వార‌సుడికి అర్జున్ క‌పూర్ స‌హా క‌పూర్ ఫ్యామిలీ స‌పోర్ట్ ఉండ‌నుందిట‌.