Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే 'లవ్ లైఫ్ అండ్ పకోడి'

By:  Tupaki Desk   |   3 March 2021 6:35 AM GMT
ట్రైలర్ టాక్: నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే లవ్ లైఫ్ అండ్ పకోడి
X
యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ నేటి ట్రెండ్ కు అద్దం పట్టే అంశాలతో తెరకెక్కిన న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ''లవ్ లైఫ్ అండ్ పకోడి''.ఈ సినిమా ద్వారా కార్తిక్ బిమల్ - సంచిత పొనాచ‌ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. మధుర శ్రీధర్‌ రెడ్డి సమర్పణలో కలర్ ఆఫ్ మై ఇంక్‌ ఫిల్మ్స్‌ బ్యానర్ పై నిర్మించబడింది. జయంత్ గాలి ఈ చిత్రానికి స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని మార్చి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో 'లవ్ లైఫ్ అండ్ పకోడీ' సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని యువ హీరో అల్లు శిరీష్ ఆవిష్కరించారు.

అరుణ్ అంటే సూర్యుడు అని.. రేయా అంటే నీటి ప్రవాహం అంటూ హీరో హీరోయిన్లు తమ పేర్లకు అర్థాలు చెప్పుకోవడంతో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. లవ్ స్టోరీస్ మరియు పకోడీలను హేట్ చేసే ఓ ప్లే బాయ్.. నో కమిట్ మెంట్స్ నో ఎక్సపెక్టేషన్స్ అంటూ రేయా అనే అమ్మాయితో 5 ఏళ్ళు రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత వారి లైఫ్ లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనేది ఇందులో చూపించారు. నేటితరం యువతీయువకులు ప్రేమ - పెళ్లి విషయాల్లో ఎలా ఆలోచిస్తున్నారు.. ఒక రిలేష‌న్‌ షిప్ కి క‌మిట్ అవడానికి ఎలాంటి క‌న్ఫ్యూజన్ కి లోనవుతున్నారనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు అర్థం అవుతోంది. నేటి యువతరం ఆలోచనలకు అద్దం పడుతున్న 'లవ్ లైఫ్ అండ్ పకోడీ' టైలర్ యూత్ ని ఆకర్షించేలా ఉంది. ఈ చిత్రానికి పవన్ సంగీతం సమకూర్చారు. సాగర్ వైవీవీ - జితిన్ మోహన్ సినిమాటోగ్రఫీ అందించారు. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ వర్క్ చేశారు.