Begin typing your search above and press return to search.

#RRR .. విదేశాల నుంచి ఒలీవియా దిగుతుందా?

By:  Tupaki Desk   |   19 July 2020 7:10 AM GMT
#RRR .. విదేశాల నుంచి ఒలీవియా దిగుతుందా?
X
మ‌హ‌మ్మారీ అంద‌రికీ ముకుతాడు వేసింది. ఎవ‌రినీ ఎటూ క‌ద‌ల‌నీకుండా చేసింది. అయ్య‌వారు క‌రుణించినా అమ్మ‌వారు శాంతించ‌లేదు అన్న చందంగా ఉంది తాజా ప‌రిస్థితి. లాక్ డౌన్ ఎత్తేసి షూటింగుల‌కు అనుమ‌తులివ్వ‌కుండా కొన్నాళ్ల పాటు బెట్టు చేసిన ప్ర‌భుత్వాలు దిగొచ్చి అనుమ‌తులు మంజూరు చేసేసినా.. ఇప్పుడు ఎవ‌రికి వారు సెల్ఫ్ లాక్ డౌన్ లో ఉండిపోవాల్సిన ధైన్యం నెల‌కొంది.

ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తీస్తున్న రాజ‌మౌళి-దాన‌య్య బృందానికి ఇది మింగుడు ప‌డ‌డం లేదు. 80 శాతం పూర్త‌యిపోయింది అని చెబుతున్నా.. ఇంకా పెండింగ్ 20 శాతం స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ త‌ల‌నొప్పిగా మారింది. 2021 స‌మ్మ‌ర్ రిలీజ్ కూడా సందిగ్ధంలో ప‌డిపోయింది. ఇదంతా ఇలా ఉంటే ఈ మూవీలో ఇంకా ఎంతో కీల‌క‌మైన‌ ల‌వ్ సీన్స్ తీయాల్సి ఉందిట‌.

సీత‌తో (ఆలియాభ‌ట్) అల్లూరి సీతారామ‌రాజు (రామ్ చ‌ర‌ణ్) స‌న్నివేశాలు కొన్ని పెండింగ్. అలాగే ఒలీవియాతో కొమురం భీమ్ ల‌వ్ సీన్స్ పెండింగులో ఉన్నాయ‌ట‌. అవ‌న్నీ పూర్తి చేస్తేనే కానీ త‌దుప‌రి ప‌నుల‌కు ఏదీ క్లారిటీ రాద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ విదేశాల నుంచి హైద‌రాబాద్ లో దిగాల్సి ఉంటుంది. ప్ర‌స్తుత స‌న్నివేశంలో ఇది కూడా ఒక చిక్కేన‌ని భావిస్తున్నారు. ఆమె వ‌స్తే ఎన్టీఆర్ తో ల‌వ్ ట్రాక్ పూర్తి చేయాల‌న్న‌ది జ‌క్క‌న్న ప్లాన్. ఇక విదేశీ వ‌నిత అయిన ఒలీవియా కొమురం భీమ్ ప్రేమ‌లో మునిగి క‌న్న త‌ల్లిదండ్రుల్నే ఎదిరించే సీన్స్ తీయాల్సి ఉంద‌ని కూడా తెలుస్తోంది. ఒలీవియా బ్రిట‌న్ లో స్టేజీ డ్రామా ఆర్టిస్టు అన్న సంగ‌తి తెలిసిందే. అలాగే తార‌క్ స‌ర‌స‌న వేరొక నాయిక సీన్స్ కూడా తీయాల్సి ఉంద‌ట‌. శ్రీ‌య‌-దేవ‌గ‌న్-స‌ముదిర‌క‌ని పాత్ర‌లు ఇందులో ఆస‌క్తిక‌రంగానే ఉంటాయ‌ని తెలుస్తోంది.