Begin typing your search above and press return to search.
యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న 'లవ్ స్టోరీ
By: Tupaki Desk | 23 Sep 2021 8:34 AM GMTతెలుగు సినిమాలకు యూఎస్ఏ లో మంచి మార్కెట్ ఉంటుందనే సంగతి తెలిసిందే. మన సినిమాలు అక్కడ మిలియన్ డాలర్లు వసూలు చేస్తుంటాయి. అయితే ఇదంతా కోవిడ్-19 రాకముందు మాట. మహమ్మారి వైరస్ వల్ల యూఎస్ బాక్సాఫీస్ వద్ద తెలుగు చిత్రాల లెక్కలన్నీ మారిపోయాయి. కరోనా కారణంగా ఓవర్ సీస్ మార్కెట్ బాగా దెబ్బ తినింది. పాండమిక్ తర్వాత యూఎస్ లో తెరుచుకున్న థియేటర్స్ పరిమిత సామర్థ్యాలతో నడుస్తున్నాయి.
థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం కంటే ఓటీటీలో చూడటాన్ని అక్కడి జనాలు ఇష్టపడుతున్నారు. అందుకే యుఎస్ థియేటరర్స్ లో విడుదలైన సినిమాలు తగినంతగా వసూలు చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాలు ఒకటీ రెండు లక్షల డాలర్లు వసూలు చేస్తేనే గొప్పగా చెప్పుకొనే పరిస్థితి వచ్చింది. పాండమిక్ తర్వాత 'జాతి రత్నాలు' సినిమా మాత్రమే యుఎస్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటగలిగింది. ఈ క్రమంలో ఇప్పుడు 'లవ్ స్టోరీ' సినిమా విడుదలకు ముందే అద్భుతమైన బుకింగ్స్ జరుగుతుందటం మేకర్స్ కు హోప్స్ కలిగిస్తోంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ'. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నారాయణ దాస్ కె. నారంగ్ - పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు శుక్రవారం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈరోజు రాత్రి యూఎస్ఏలో ప్రీమియర్స్ పడతాయి. ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం, 'లవ్ స్టోరీ' ప్రీ బుకింగ్స్ లో ఇప్పటి వరకు 150K డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. యూఎస్ లోని టెక్సాస్ ($ 27,475) - కాలిఫోర్నియా ($ 16,447) - న్యూజెర్సీ ($ 10,161) మరియు వర్జీనియా ($ 9,572) వంటి అనేక ప్రాంతాలలో ప్రీ సేల్స్ చాలా బాగున్నాయి.
శేఖర్ కమ్ముల మరియు నాగచైతన్య చిత్రాలకు ఓవర్సీస్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా ఇప్పటికే 'లవ్ స్టోరీ' నుంచి విడుదలైన ట్రైలర్ మరియు పాటలకు వీక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. దీంతో ఈ సినిమాపై భారీహైప్ క్రియేట్ అవడంతో.. అదే స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగాయి. ప్రీ-బుకింగ్ ట్రెండ్స్ ను పరిగణనలోకి తీసుకుంటే మేకర్స్ ప్రీమియర్ల ద్వారా భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.