Begin typing your search above and press return to search.
పవన్ స్టార్ డమ్ ని బీట్ చేసిన శేఖర్ బ్రాండ్ ఇమేజ్
By: Tupaki Desk | 25 Sep 2021 4:30 AM GMTస్టార్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద ఆ సందడే వేరు.. ఆ క్రేజే వేరు. అయితే ఆ క్రేజ్‌ని సెన్సిబుల్ డైరెక్టర్ బ్రాండ్ ఇమేజ్ ఇటీవల బీట్ చేసింది. దీంతో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యానికి.. షాక్ కు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. నాగచైతన్య.. సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీ ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
పాటలతో రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టించి ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ పరంగా ఓవర్సీస్ మార్కెట్ లోనూ.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డును సృష్టించడమే కాకుండా శేఖర్ కమ్ముల బ్రాండ్ ఇమేజ్ కారణంగా యూఎస్ మార్కెట్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `వకీల్ సాబ్`ని క్రాస్ చేయడం విశేషం. యూఎస్ ప్రీమియర్ షోస్ ద్వారా ఈ మూవీ 306కె యూఎస్ డాలర్లని వసూలు చేసింది. `వకీల్ సాబ్` మాత్రం 300కె డాలర్లని మాత్రం వసూలు చేయగలిగింది.
దీంతో యుఎస్ మార్కెట్ లో 2021లో అత్యధిక ఓపెనింగ్స్ ని రాబట్టిన దక్షిణాదికి చెందిన మొట్టమొదటి చిత్రంగా నిలిచింది. ఆ తరువాత స్థానాల్లో వకీల్ సాబ్.. మాస్టర్.. జాతిరత్నాలు చిత్రాలు నిలిచాయి. అయితే ఓపెనింగ్ పరంగా ఈ మూవీ రికార్డు సృష్టించినా టాక్ పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. రివ్యూస్ కూడా ఆశాజనకంగా లేవు... ఈ వీకెండ్ ని బట్టి ఈ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందన్నది చూడాలి.
ఇదిలా వుంటే ఈ మూవీ రిజల్ట్ తో పాటు ఈ సినిమా చాలా మందిని థీయేటర్లకి మళ్లీ రప్పించి థియేటర్లని కళకళ లాడిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం గడప దాటతారని థియేటర్లలోకి వస్తారని భావిస్తున్నారు. కానీ పాండమిక్ స్కేర్ ఇంకా వారిని వెంబడిస్తూనే వుంది. అయితే ఈ వారాంతం ఫుల్స్ ని బట్టి ఓ క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం లేకపోలేదు.