Begin typing your search above and press return to search.

దేవీ చేసేది కేవలం ప్రేమ‌కథే

By:  Tupaki Desk   |   29 Nov 2015 3:30 PM GMT
దేవీ చేసేది కేవలం ప్రేమ‌కథే
X
త‌న‌దైన సంగీత ఝ‌రితో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఓల‌లాడిస్తున్నాడు దేవీశ్రీ ప్ర‌సాద్‌. డీఎస్‌ పీగా ద‌శాబ్ధాల పాటు త‌న‌దైన విన్యాసాల‌తో ఉర్రూత‌లూగిస్తూనే ఉన్నాడు. ఆట‌గాడు .. పాట‌గాడు.. మ‌న‌సు దోచే లుక్కున్నోడు.. అన్న పేరు తెచ్చుకున్నాడు. వేదిక‌లు ఎక్కి ఎన‌ర్జిటిక్ స్టెప్పులు వేసే అరుదైన సంగీత ద‌ర్శ‌కుడిగా అంద‌రిచేతా మెప్పు పొందాడు. ఇప్పుడిక హీరోగా మారుతున్నాడు.

దేవీశ్రీ హీరోగా న‌టించేస్తున్నాడు. అత‌డిని హీరోని చేసేందుకు సుకుమార్ క‌థ రెడీ చేశాడు. నేనే నిర్మిస్తా అంటూ దిల్ రాజు అన‌డం దానిని మీడియా హైలైట్ చేసేసింది. మ‌రి దేవీ న‌టించే సినిమాకి క‌థ ఎలా ఉండాలి? ప్రేమ క‌థ అయితే బావుంటుంది క‌దూ? సుక్కూ అత‌డిని అభిన‌వ ప్రేమికుడిగా చూపిస్తాడేమో.. లాజిక్కు తెలిసిన సుకుమార్ దేవీ రియ‌ల్ ల‌వ్‌ స్టోరీనే తెర‌పై చూపిస్తాడా ఏం? అదంతా ఒకెత్తయితే.. అతగాడు కంపోజర్‌ కాబట్టి.. ఒక మ్యూజిక్‌ రిలేటడ్‌ సినిమాను కూడా చేస్తున్నారని ఒక టాక్‌ ఉంది. ఇంతకీ ఎటువంటి కతతో మనోడు సినిమా చేస్తున్నాడు?

దేవిశ్రీ మాత్రం.. తన సంగీతానికి దూరంగా.. కేవలం ఒక ప్రేమకథనే చేస్తున్నాడట. సినిమాలో తనో మ్యూజిక్‌ డైరక్టర్‌ అనే టచ్‌ లేకుండా.. ఓన్లీ తన నటనాచాతుర్యం బయటపడేలా సీన్ లను డిజైన్‌ చేయాలని అన్నయ్య సుక్కూతో చెప్పాడట కూడా. సుకుమార్‌ డైరక్షన్‌ డిపార్ట్ మెంట్ అంతా ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు.