Begin typing your search above and press return to search.
'లవ్ స్టోరీ' ని లేట్ చేశామని ఇప్పుడు ఫీల్ అవుతున్నారా..?
By: Tupaki Desk | 30 April 2021 5:30 PM GMTయువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య - నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ''లవ్ స్టోరీ''. ఇప్పటికే విడుదలైన టీజర్ - పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా 'సారంగ దరియా' సాంగ్ అయితే మిలియన్ల వ్యూస్ రాబట్టి సినిమాకి బజ్ తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 16న తెలుగు కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాని అనవసరంగా లేట్ చేశామని చిత్ర బృందం ఇప్పుడు ఫీల్ అవుతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి 'లవ్ స్టొరీ' సినిమా వర్క్ మొత్తం ఫిబ్రవరి నెలలోనే అయిపోయింది. ఆ సమయంలో విడుదలైన సినిమాలు కూడా మంచి వసూళ్ళు రాబట్టాయి. అయితే సమ్మర్ లో రిలీజ్ చేస్తే కలెక్షన్స్ బాగా వస్తాయనే అనే ప్లానింగ్ తో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. కానీ అనుకోకుండా కరోనా కేసులు పెరగడంతో అందరికంటే ముందుగా 'లవ్ స్టోరీ' బృందమే తమ సినిమా విడుదలని వాయిదా వేసింది. ప్లానింగ్ అంటూ టైమ్ వేస్ట్ చేసి 'లవ్ స్టోరీ'ని అప్పుడే థియేటర్ రిలీజ్ చేయకుండా స్వయంకృత అపరాధం చేశామని ఇప్పుడు టీమ్ అంతా బాధపడుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
'సారంగ దరీయా' పాటకు వచ్చిన క్రేజ్ తగ్గిపోయే లోపే ఈ సినిమా జనాలు ముందుకు తీసుకొస్తే మంచిదని సినీ జనాలు అభిప్రాయ పడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన చూస్తుంటే ఇప్పుడప్పుడే ఆ పరిస్థితి కనిపించడం లేదు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి. 'లవ్ స్టోరీ' చిత్రానికి పవన్ సి.హెచ్ సంగీతం సమకూర్చగా.. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కె.నారాయణదాస్ నారంగ్ - పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.