Begin typing your search above and press return to search.

స్వచ్ఛమైన ప్రేమ కథా సంవత్సరం

By:  Tupaki Desk   |   29 Dec 2016 3:30 AM GMT
స్వచ్ఛమైన ప్రేమ కథా సంవత్సరం
X
సినిమాలు ఎప్పుడూ మూడు పాయింట్ల చుట్టూనే తిరుగుతుంటాయ్. ప్రేమ.. పగ.. డబ్బు అంటారు సీనియర్లు. ఇంకా డెప్త్ గా చెప్పాలంటే ఏదో ఒక పాయింట్ పై ప్రేమ చుట్టూనే మూవీ కథ ఉంటుంది. లవ్ స్టోరీస్ వస్తూనే ఉంటాయ్ కానీ కొంత కాలంగా ప్రేమలో స్వచ్ఛంగా చూపిస్తూ.. దాని చుట్టూనే కథ నడపడం అరుదుగా మారిపోయింది. వేరే వేరే జోనర్లతో మిక్స్ చేసి కిచిడీలుగా మార్చేస్తున్నారు. అఫ్ కోర్స్.. వీటిలో కొన్ని హిట్స్ సాధిస్తున్న మాట వాస్తవమే.

2016లో మాత్రం కేవలం ప్రేమ చుట్టూనే నడిచే కథలతో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు వచ్చాయి. వీటిలో అధిక శాతం సక్సెస్ సాధించడం కూడా విశేషం. ఈ ఏడాది ప్రారంభంలోనే వచ్చిన రామ్-కీర్తి సురేష్ ల మూవీ నేను శైలజ. ఈ మూవీ అంతా కేవలం ప్రేమ.. హీరో హీరోయిన్ల పెర్ఫామెన్స్ చుట్టూనే సాగుతుంది. నాని మూవీ కృష్ణగాడి వీరప్రేమగాధ కూడా ప్రేమకథా చిత్రమే. ఇందులో ఫ్యాక్షనిజం ఎపిసోడ్స్ ఉంటాయ్ కానీ.. ప్రేమకే ప్రాధాన్యత ఉంటుంది. త్రివిక్రమ్ మూవీ అ..ఆ.. కూడా చక్కని ప్రేమకథా చిత్రాల జాబితాలో చేర్చాల్సిందే. అసలు విలన్ అనే కాన్సెప్ట్ లేకుండానే సినిమా సాగుతుంది. రావు రమేష్ కేరక్టర్ కూడా.. తన కూతురుపై ప్రేమను చాటేదే.

పెళ్లి చూపులు అంటూ వచ్చిన మూవీ కూడా ఇంతే. పెళ్లి చూపుల్లో కలిసిన జంట.. తమ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకున్నారన్నదే సినిమా. జ్యో అచ్యుతానందలో అయితే.. అన్నాదమ్ములు ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించి.. చివరకు ఆమె ప్రేమించినవాడితో ఎలా కలిపారో చూపిస్తారు. నాగ చైతన్య మూవీ ప్రేమమ్ లో మూడు ప్రేమకథలుండగా అన్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చైతు-శృతిల ఎపిసోడ్ ని మర్చిపోవడం అంత సులువైన విషయం కాదు.

ప్రేమకథలను కొత్త పాయింట్ తో చూపిస్తూనే.. కొత్తదనాన్ని అందిస్తున్న నవతరం దర్శకులను అభినందించాల్సిందే. ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమకథలకు డిమాండ్.. ఆదరణ ఎప్పటికీ ఉంటుందంటారు సినీ పండితులు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/