Begin typing your search above and press return to search.
'లవ్ స్టోరీ' ని మళ్లీ ట్రాక్ ఎక్కించాల్సిందే..!
By: Tupaki Desk | 25 May 2021 11:30 AM GMTఅక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ''లవ్ స్టోరీ''. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా విడుదలను కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కారణంతో వాయిదా వేశారు. గతేడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల డిలే అవుతూ వచ్చింది. అదే సమయంలో ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తారంటూ రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఇది థియేటర్స్ లో ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అనే ఆలోచనతో నిర్మాతలు ఓటీటీ ఆఫర్ కి మొగ్గు చూపలేదు. ఫైనల్ గా ఈ సమ్మర్ లో వస్తుంది అనుకునేలోపే మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. దీంతో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు మళ్ళీ ఊపందుకున్నాయి.
ఇప్పటికే విడుదలైన 'లవ్ స్టోరీ' చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు - టీజర్ - పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా 'సారంగ దరియా' పాట 200 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి ఈ సినిమాకి బజ్ తెచ్చిపెట్టింది. అయితే ఈ పాట భారీ ఓపెనింగ్స్ తీసుకువస్తుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు రీత్యా అసలు జనాలు థియేటర్ కి వస్తారో రారో కూడా చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. అందుకే 'సారంగ దరీయా' పాటకు మంచి క్రేజ్ వచ్చినా.. రాబోయే రోజుల్లో థియేటర్స్ రీ ఓపెన్ చేసిన తర్వాత 'లవ్ స్టోరీ' ని మళ్లీ ట్రాక్ ఎక్కించాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు.
కాగా, 'లవ్ స్టోరీ' చిత్రానికి పవన్ సి.హెచ్ సంగీతం సమకూర్చారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కె.నారాయణదాస్ నారంగ్ - పి.రామ్మోహన్ రావు కలసి ఈ చిత్రాన్ని నిర్మించారు. 'ఫిదా' తర్వాత గ్యాప్ తీసుకొని శేఖర్ కమ్ముల చేస్తున్న ''లవ్ స్టొరీ'' సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.