Begin typing your search above and press return to search.

'లవ్ స్టోరీ' అఫిషియల్‌ అనౌన్స్ మెంట్‌ వచ్చింది

By:  Tupaki Desk   |   17 Oct 2021 2:48 PM GMT
లవ్ స్టోరీ అఫిషియల్‌ అనౌన్స్ మెంట్‌ వచ్చింది
X
నాగ చైతన్య మరియు సమంత జంటగా రూపొందిన లవ్ స్టోరీ సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సెకండ్‌ వేవ్ తర్వాత అతి పెద్ద విజయంగా లవ్‌ స్టోరీ నిలిచిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో లవ్‌ స్టోరీ సినిమా ను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయడం కోసం అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆహా లో లవ్‌ స్టోరీ స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్‌ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. అక్టోబర్ 22 సాయంత్రం 6 గంటల సమయంలో ఆహా లో స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. ఆహా వారు ప్రత్యేకంగా ఈ సినిమా కోసం ట్రైలర్ ను కట్‌ చేశారు.

ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రత్యేకంగా ట్రైలర్ కట్‌ చేయడం అరుదుగా జరుగుతుంది. సాదారణంగా అయితే సినిమా విడుదల సమయంలో థియేట్రికల్‌ ట్రైలర్ ను చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేస్తారు. అదే ఓటీటీ వారు ప్రమోషన్ కు వినియోగిస్తారు. కాని ఈసారి లవ్‌ స్టోరీ కోసం ప్రత్యేకంగా ట్రైలర్ ను కట్‌ చేయించి విడుదల చేశారు. ట్రైలర్ ఓటీటీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కట్‌ చేసి విడుదల చేశారు. సినిమా స్ట్రీమింగ్‌ కోసం ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్ ల్లో చూడాలేక పోయిన వారు ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలోనే థియేటర్‌ రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌ కు సిద్దం అయ్యారు.

లవ్ స్టోరీ లో నాగ చైతన్య నటన మరియు సాయి పల్లవి డాన్స్‌ కమ్‌ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. క్లైమాక్స్ విషయంలో కాస్త మిశ్రమ స్పందన మినహా మొత్తంగా సినిమా కు సక్సెస్ టాక్ వచ్చింది. ఒక మంచి మెసేజ్ తో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో కూడిన కథను దర్శకుడు చాలా చక్కగా నడిపించాడు. ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్‌ అవుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆహా లో అత్యధిక వ్యూస్ దక్కించుకోబోతున్న సినిమా గా ఇది నిలవడం ఖాయం అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.