Begin typing your search above and press return to search.
టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబడుతున్న 'లవ్ స్టోరీ'.. ఫస్ట్ డే ఎంతంటే..?
By: Tupaki Desk | 25 Sep 2021 8:30 AM GMTయువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ''లవ్ స్టోరీ''. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఫస్ట్ డే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. మంచి వసూళ్ళు రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద రికార్డు ఓపెనింగ్స్ తెచ్చుకుంది.
'లవ్ స్టోరీ' సినిమాకు వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ₹16.73 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఏపీ తెలంగాణాలలో ఈ సినిమా ₹10.46 కోట్లు వసూలు చేసింది. ఇందులో కేవలం నైజాం ఏరియాలోనే ₹ 3.50 కోట్లు రాబట్టడం విశేషం. ఇక రెస్టాప్ ఇండియాలో ₹0.92 కోట్లు - రెస్టాఫ్ వరల్డ్ లో ₹5.35 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన భారతీయ సినిమాగా 'లవ్ స్టొరీ' నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం ఆక్యుపెన్సీతో తక్కువ టికెట్ ధరలతో 'లవ్ స్టోరీ' సినిమా ఈ స్థాయి వసూళ్ళు రాబట్టడం గమనార్హం. తమిళనాడు - కర్ణాటక రాష్ట్రాల్లో కూడా యాభై శాతం ఆక్యుపెన్సీ నడుస్తున్న సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితుల్లో ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలో కూడా 'లవ్ స్టోరీ' సినిమా మంచి వసూళ్ళు రాబట్టడం రాబోయే సినిమాలకు ఖచ్చితంగా ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.
యూఎస్ఏ లో 'లవ్ స్టోరీ' సినిమా ఇప్పటికే $ 560K డాలర్లు వసూలు చేసింది. ప్రీమియర్స్ ద్వారా ఈ చిత్రానికి $306K వచ్చాయి. దీంతో 2021లో అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి భారతీయ సినిమాగా నిలిచింది. నిన్న శుక్రవారం మరో $260K - $290K వసూళ్ళు దీనికి యాడ్ అయ్యాయని తెలుస్తోంది. యుఎస్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ $ 1.2 మిలియన్స్ ఉండగా.. వారాంతంలో ఈ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది.
ఇక 'లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.26.3 కోట్లు వరకు జరగగా.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.32 కోట్లు అని తెలుస్తోంది. రెండో రోజు కూడా ఈ సినిమా బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేస్తుందో చూడాలి.
కాగా, 'లవ్ స్టొరీ' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ - అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందించారు. ఈ చిత్రానికి విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. పవన్ సంగీతం సమకూర్చారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేశారు. ఇందులో లీడ్ పెయిర్స్ తో పాటుగా రాజీవ్ కనకాల - దేవయాని - ఈశ్వరి రావు - తాగుబోతు రమేష్ తదితరులు నటించారు.