Begin typing your search above and press return to search.

కరోనాకు చెక్ పెట్టిన 'లవ్ స్టోరీ' టీమ్..!

By:  Tupaki Desk   |   28 April 2021 9:55 AM GMT
కరోనాకు చెక్ పెట్టిన లవ్ స్టోరీ టీమ్..!
X
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య - నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ''లవ్ స్టోరీ''. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కె.నారాయణదాస్ నారంగ్ - పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ నేపథ్యంలో వాయిదా పడింది. అయితే గతేడాది కరోనా సమయంలో అందరి కంటే ముందుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విజయవంతంగా షూటింగ్ జరుపుకున్న సినిమా ఇదేనని చెప్పవచ్చు. శేఖర్ కమ్ముల ముందుచూపు కారణంగా దాదాపు వంద మంది యూనిట్ మెంబర్స్ లో ఒక్కరు కూడా కరోనా బారిన పడకుండా షూట్ చేయగలిగారు.

గతేడాది లాక్ డౌన్ సడలింపులలో భాగంగా కొద్ది మంది యూనిట్ తో సినిమా షూటింగులు జరుపుకోడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో సుమారు 100 మంది యూనిట్ తో "లవ్ స్టోరీ" సినిమా షూటింగ్ ఆగస్టు నెలలో తిరిగి ప్రారంభించారు. అయితే ఆ సమయంలో టీమ్ లో ఒక్కరికి కరోనా వచ్చినా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ముందుగా సెట్ మొత్తం శానిటైజ్ చేయడం.. సెట్ లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్క సభ్యుడిని శానిటైజ్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు షూటింగ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి రెండు రోజుల ముందే ఆర్టీపీసీఆర్ విధానంలో కరోనా టెస్ట్ లు నిర్వహించి.. నెగిటివ్ రిపోర్ట్ వస్తేనే సెట్ లోకి అనుమతించారని తెలుస్తోంది.

అలానే యూనిట్ అందరికీ ఆర్టీపీసీఆర్ - శానిటైజర్స్ - మాస్కులతో పాటు ఫేస్ షీల్డ్ లు కూడా ఇచ్చారు. కరోనా జాగ్రత్లతో పాటు పుష్టికరమైన ఆహారం - మల్టీ విటమిన్ టాబ్లెట్లు సెట్ లో అందించేవారు. ఈ క్రమంలో బౌన్సర్లతో సహా మొత్తం 24 క్రాఫ్టులలోని యూనిట్ సభ్యులు 95 మందికి సెప్టెంబర్ వరకు కొనసాగేలా రూ.3 లక్షల కోవిడ్ ఇన్యూరెన్స్ చేయించారని తెలుస్తోంది. అయితే ఎవరికీ ఈ హెల్త్ ఇన్యూరెన్స్ ఉపయోగించుకునే పరిస్థితి రాలేదు. ఎందుకంటే 'లవ్ స్టోరి' యూనిట్ లో ఏ ఒక్కరికీ కరోనా సోకలేదు. కరోనా టైంలో జాగ్రత్తలకు గాను నిర్మాతలు 50 లక్షల దాకా భరించారని సమాచారం. ఇలా కరోనా మహమ్మారికి చెక్ పెడుతూ ఏ ఒక్కరూ వైరస్ బారిన పడకుండా 'లవ్ స్టొరీ' షూటింగ్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు.

అయితే ఇప్పుడు అదే కరోనా సినిమా విడుదలను వాయుదా పడేలా చేసింది. ఏప్రిల్ 16న తెలుగు కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ కావాల్సిన 'లవ్ స్టోరీ' చిత్రాన్ని కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా పోస్ట్ పోన్ చేశారు. ఎప్పుడు విడుదలైనా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తర్వాత 'లవ్ స్టొరీ' సినిమా తదుపరి విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటిస్తారు.