Begin typing your search above and press return to search.
బ్రేక్ ఈవెన్ దిశగా 'లవ్ స్టొరీ'
By: Tupaki Desk | 30 Sep 2021 7:36 AM GMTయువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య - నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ''లవ్ స్టోరీ''. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తో మంచి వసూళ్ళు రాబట్టి మ్యాజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కరోనా దెబ్బకు కుదేలైన సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపిరిపోసింది. పాండమిక్ తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా.. యూఎస్ఏ లో 1 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన మూవీగా 'లవ్ స్టోరి' రికార్డ్ క్రియేట్ చేసింది.
'లవ్ స్టోరీ' మూవీ ఫస్ట్ వీక్ లో థియేటర్లలో మంచి కలెక్షన్స్ తెచ్చుకోవడంతో ట్రేడ్ వర్గాల్లో మళ్ళీ ఆశలు చిగురించాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఓవర్2 సీస్ లో ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టడం అందరికీ ఉపశమనం కలిగించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మొదటి నాలుగు రోజుల వసూళ్లతో పోల్చుకుంటే ఐదో రోజు మాత్రం కాస్త డ్రాప్ అయిందని తెలుస్తోంది. గులాబ్ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా కలెక్షన్లు స్వల్పంగా తగ్గాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే వానలు తగ్గుముఖం పట్టడంతో ఆరో రోజు వసూళ్ళు పర్వలేదనిపించాయి. ఈ క్రమంలో రెండో వారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మళ్లీ పుంజుకున్నాయని తెలుస్తోంది.
'లవ్ స్టోరీ' చిత్రానికి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ - మంచి రివ్యూలు రేటింగులు వంటివి రాబోయే వారాంతంలో ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు తిరిగి వెళ్లేలా చేసే అవకాశం ఉంది. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అవ్వాలని సినీ అభిమానులతో పాటుగా ఇండస్ట్రీ మొత్తం కోరుకుంది. విడుదలకు ముందే భారీ బజ్ క్రియేట్ అవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ. 31 కోట్ల మేర జరిగినట్లు తెలుస్తోంది. దీంతో 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగిన ఈ మూవీ అలవోకగా ఈ మార్క్ అందుకుంటుందని రిటర్న్స్ ని బట్టి అర్థం అవుతోంది. వచ్చే వారాంతంలో బాక్సాఫీస్ వద్ద 'లవ్ స్టోరీ' డ్రీమ్ రన్ సాధించే ఛాన్సెస్ ఉన్నాయి.
దసరా పండుగ వరకు ఎలాంటి క్రేజీ సినిమా లేకపోవడం కూడా 'లవ్ స్టోరీ' చిత్రానికి సహాయపడుతుంది. లైంగిక వేధింపులు - కుల వివక్ష వంటి తీవ్రమైన సమస్యలను దర్శకుడు శేఖర్ కమ్ముల నిజాయితీగా తెరకెక్కించడం.. నాగ చైతన్య మరియు సాయి పల్లవిల అత్యుత్తమ నటన.. అద్భుతమైన సంగీతం వంటివి ఈ ప్రేమ కథా చిత్రం కోసం ప్రేక్షకులను ఆకర్షించే అంశాలని చెప్పవచ్చు. కాబట్టి రాబోయే రెండు వారాల పాటు 'లవ్ స్టోరీ' డ్రీమ్ రన్ కొనసాగుతుందని అనుకోవచ్చు.
కాగా, 'లవ్ స్టొరీ' చిత్రాన్ని సునీల్ నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ - అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందించారు. నారాయణ దాస్ కె. నారంగ్ - పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రొడక్షన్ లోకి దిగిన తర్వాత ఏషియన్ సినిమాస్ వారికి ఇది ఫస్ట్ సినిమా. విజయ్ సి కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. పవన్ సీహెచ్ సంగీతం సమకూర్చారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఇందులో లీడ్ పెయిర్స్ తో పాటుగా రాజీవ్ కనకాల - దేవయాని - ఈశ్వరి రావు - ఉత్తేజ్ - చక్రపాణి - గౌరీ ప్రియ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.