Begin typing your search above and press return to search.
`హ్యాపీడేస్` ఫీల్ తెస్తే సక్సెస్ సాధ్యమే..!
By: Tupaki Desk | 22 Sep 2021 6:46 AM GMTనాగచైతన్య-సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ములా తెరకెక్కించిన `లవ్ స్టోరీ` ఈనెల 24న భారీ అంచనాల నడుమ రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆన్ లైన్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. అయితే ఈ హడావుడి దూకుడు ఎన్ని రోజులు? అన్నది అప్పుడే క్లారిటీగా చెప్పలేం. కొవిడ్ మొదటి వేవ్ తర్వాత ఆడియన్స్ యథావిధిగా థియేటర్లకు వచ్చారు. కానీ సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్లు అంటేనే భయపడిపోయే సన్నివేశం ఎదురైంది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. ప్రస్తుతం పబ్లిక్ లో జనం తిరగడం చూస్తుంటే భయం దాదాపు తొలగిపోయినట్లే కనిపిస్తోంది. అలాగని ఇదే నిజం అని కచ్చితంగా చెప్పలేం.
ప్రధానం ఈ సమస్య ఫ్యామిలీ ఆడియన్స్ తోనే ఎదురవుతుంది. కుటుంబ సమేతంగా సినిమాకి రావడం అంటే ఓ వర్గం ప్రేక్షకులు వెనకడుగు వేసే అవకాశం ఉంది. రిస్క్ తీసుకోవడం అవసరమా? అనుకునే వారు లేకపోలేదు. బిసీ సెంటర్లో అయితే పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. స్కూళ్లు..కాలేజీలు యథావిధిగా నడుస్తున్నాయి కాబట్టి లవ్ స్టోరీకి నూరుశాతం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. సినిమాకి మంచి టాక్ తెచ్చుకుని..యవతకి రీచ్ అయితే సినిమా సక్సెస్ అయినట్లే. అప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపించకపోయిన పెద్దగా వచ్చే నష్టమేమి ఉండదు. అయితే లవ్ స్టోరీ యూత్ కి ఎక్కాలంటే కమ్ములా బ్రాండ్ హ్యాపీడేస్ రేంజ్ లో రీచ్ అవ్వాల్సి ఉంది.
ఆ సినిమా కేవలం స్టూడెంట్స్ కారణంగా అంత పెద్ద సక్సెస్ అయింది. అది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా కాదు. కేవలం యువత కారణంగానే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడున్న తాజా పరిస్థితుల నడుమ అదే బజ్ లవ్ స్టోరీ రిలీజ్ తర్వాత తీసుకు రాగలిగితే కమ్ములా టీమ్ రిలాక్స్ అయిపోవచ్చు. నూటికి నూరుశాతం సేఫ్ జోన్ లో ఉన్నట్లే. వారంలో సునాయాసంగా 100 కోట్ల వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బహుశా కమ్ములా నమ్మకం కూడా అదే అయి ఉంటుంది. లేదంటే తాజా పరిస్థితుల్లో అంత ధైర్యంగా ఎలా థియేటర్లలోకి వచ్చేస్తారు? అన్న రీజన్ వినిపిస్తోంది.
అక్కినేని `ప్రేమనగర్` రేంజులో..?
24 సెప్టెంబర్ 1971 అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమనగర్ రిలీజ్ తేదీ. యాథృచ్ఛకంగానే ఇదే తేదీని నాగచైతన్య లవ్ స్టోరి కోసం లాక్ చేయడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది. సెకండ్ వేవ్ అనంతరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న `లవ్ స్టోరీ` రిలీజ్ కి సిద్ధమవుతున్న వేళ ఇది హాట్ డిబేట్ గా మారింది. ఇటీవల లవ్ స్టోరి ట్రైలర్ విడుదలైంది. దీనికి మంచి స్పందన లభిస్తోంది. శేఖర్ కమ్ముల మ్యాజిక్ ట్రైలర్ ఆద్యంతం వర్కవుటైంది. లీడ్ పెయిర్ నాగ చైతన్య - సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే సాయిపల్లవి డ్యాన్సుల దుమారం ట్రైలర్ ని మరో లెవల్ కి చేర్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
#ప్రేమ కథ బాగుంది రా చై! టాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ `ప్రేమనగర్` లా ఉంది. `ప్రేమ్ నగర్` అదే తేదీన అంటే సెప్టెంబర్ 24 న విడుదలైంది.. అంటూ నాగార్జున అభిమానుల్లో జోష్ పెంచారు. లవ్ స్టోరి కూడా కల్ట్ క్లాసిక్ జానర్ లో అందరి మనసులు దోచేసి పెద్ద విజయం దక్కించుకుంటుందని ఆ తర్వాత అంచనా ఏర్పడింది. లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల బ్రాండ్ మూవీ. అందువల్ల యువతరంలో మంచి క్రేజ్ ఉంది. విజయంపై చిత్రబృందం చాలా ధీమాగా ఉంది.
ఇక ఇటీవల విడుదలైన సినిమాలన్నీ మంచి టాక్ తెచ్చుకున్నా కరోనా భయాల నడుమ జనాల్ని థియేటర్లకు రప్పించలేకపోయాయి. గోపిచంద్ సీటీమార్ మాస్ ని థియేటర్లకు రప్పించింది. ఇప్పుడు చైతన్య లవ్ స్టోరి మాస్ క్లాస్ అందరినీ థియేటర్లకు లాగాల్సి ఉంటుంది. ఇది నిజంగానే లవ్ స్టోరీకి బిగ్ ఛాలెంజింగ్ టైమ్ అని చెప్పాలి.
మూవీ మొఘల్ ని నిలబెట్టిన క్లాసిక్ ప్రేమనగర్ !
అక్కినేని నాగేశ్వరరావు నటించిన `ప్రేమనగర్` 1971లో విడుదలైంది. ప్రఖ్యాత రచయిత్రి అరికెపూడి కౌసల్యాదేవి (కోడూరి కౌసల్యాదేవి) రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అత్యంత విజయనంతమైన తెలుగు నవలాచిత్రాలలో ఇది ఒకటి. అంతకు ముందు కొన్ని సినిమాలలో నష్టాలనెదుర్కొన్న మూవీ మొఘల్ డా. డి.రామానాయుడు ఈ సినిమాతో నిర్మాతగా సినీరంగంలో నిలదొక్కుకున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తమిళం.. హిందీలలో కూడా పునర్నిర్మించారు.
కళ్యాణ్ (అక్కినేని) అనే జమీందారు కొడుకు విలాసనంతమైన జీవితానికి దురలవాట్లకు బానిసవుతాడు. ఎయిర్-హోస్టెస్ గా పరిచయమైన లత (వాణిశ్రీ) వారింట్లో సెక్రటరీగా చేరుతుంది. అభిమానవతి అయిన ఆమె క్రమంగా కళ్యాణ్ ను నిలకడైన జీవనవిధానంవైపు మళ్ళిస్తుంది. ఆమెపట్ల ఆకర్షితుడైన కళ్యాణ్ ఆమెను వివాహం చేసుకోవాలనుకోగా కుటుంబంనుండి ప్రతిఘటన ఎదురవుతుంది. అలా విడిపోయిన వారు తిరిగి కలుసుకొంటారు. ఈ మధ్యలో సంఘర్షణ ఏమిటి.. చివరికి ఈ ప్రేమకథలో ట్విస్టేమిటి? అన్నది తెరపైనే చూడాలి. తెలుగు ఆడియెన్ ని కంటికి కునుకు లేకుండా చేసిన చిత్రమిది. మహిళా అభిమానులు అక్కినేనిని గొప్పగా ఆరాధించేలా చేసిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఇప్పుడు మళ్లీ లవ్ స్టోరితో అక్కినేని మనవడు నాగచైతన్య ఆ ఫీట్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి.