Begin typing your search above and press return to search.
నివేదా రివీల్ చేసిన లవ్ ట్రాక్ రీల్ సీన్ కు ఏమాత్రం తగ్గదు
By: Tupaki Desk | 22 Aug 2021 5:30 AM GMTసెలబ్రిటీల ప్రేమ ముచ్చట్లు ఆసక్తికరంగా ఉంటాయి. అయితే.. తాము రివీల్ చేసే లవ్ ప్రపోజల్స్ అన్ని కూడా తాము రిజెక్టు చేసినవే ఉంటాయి. తాజాగా అలాంటిదే ఒకటి చెప్పుకొచ్చారు నివేదా పేతురాజ్. యూత్ ను ఇట్టే ఆకర్షించే ఈ బ్యూటీ తాజాగా తనకొచ్చిన లవ్ ప్రపోజల్ గురించి చెప్పింది. రీల్ సీన్ మాదిరి ఉంటే ఈ ఉదంతాన్ని ఆమె మాటల్లోనే చెబితే మరింత ఆసక్తికరంగా ఉంటుంది.
తాను కాలేజీ రోజుల్లో ఒక అబ్బాయి తనను చాలా ఇష్టపడ్డాడని.. ఒక వాలెంటైన్స్ డే రోజు తాను కాలేజీ లైబ్రరీలోకి వెళ్లే వేళ.. ఒక అబ్బాయి తన ఎదురుగా వచ్చి.. తన చేతికి పూలబొకే ఇచ్చాడని చెప్పింది. బయట బండి మీద ఒక అబ్బాయి వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు. సరే.. ఎవరో చూద్దామని తాను వెళ్లానని.. నిజంగానే అక్కడో కుర్రాడు ఉన్నాడని చెప్పింది. విషయం ఏమిటని అడిగితే.. ఏడాదిగా పాలో అవుతున్నానని.. నిజాయితీగా ప్రేమిస్తున్నట్లు చెప్పాడు.
చేతికి లవ్ లెటర్ ఇవ్వబోయాడని.. తాను అప్పటికి ఒక్కసారిగా అతన్ని తన క్లాస్ లో చూడలేదని.. తన ప్రేమ గురించి ఇంకేదో చెప్పబోతుంటే.. నో చెప్పేసినట్లు చెప్పింది. ''లవ్ లెటర్ కూడా తీసుకోలేదు.. అతని ప్రపోజల్ నురిజెక్టు చేశా. కానీ.. అతడిచ్చిన పూల బొకేను మాత్రం తీసుకున్నా. అవి చాలా బాగున్నాయి. అందుకే తీసుకున్నా'' అని చెప్పారు. ఆ తర్వాత అతన్ని తానెప్పుడూ చూడలేదని చెప్పింది.
ఇప్పటివరకు తాను ఎవరిని ప్రేమించలేదని.. పెళ్లి చేసుకునేది తల్లిదండ్రులు చూపించే కుర్రాడినేనని స్పష్టం చేసింది. ఇప్పటికైతే పెళ్లి ఆలోచనలు లేవు కానీ.. చేసుకుంటే మాత్రం పెద్దలు కుదిర్చినదే అవుతుందని స్పష్టం చేసింది. ఎవరినైనా ఇష్టపడుతున్నావా? అని మా అడుగుతుంటుంది. కానీ.. నేను మాత్రం.. నువ్వే ఎవరినైనా చూసి పెట్టు.. నేను పెళ్లి చేసుకుంటానని చెబుతానని చెప్పింది. తన జీవితంలో తనకు వచ్చిన ఏకైక లవ్ ప్రపోజల్ అదేనని చెప్పింది.
తన జీవితంలో ఏదైనా అనుకోనిది జరిగితే.. నాకే ఎందుకిలా? అని కూర్చోనని.. ప్రతి దెబ్బ ఒక గొప్ప పాఠం నేర్పుతుందని చెబుతారు. దెబ్బలు తగిలిన ప్రతిసారీ బలమైన వ్యక్తిగా మారుస్తుందని చెప్పిన నివేదా.. ప్రతి చెడు వెనుక ఒక మంచి ఉందని బలంగా నమ్ముతానని చెప్పారు. తాను దుబాయ్ లో జాబ్ చేసే రోజుల్లో ఒకే నెలలో ఐదుసార్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యానని.. ప్రతిది ఎదుటివారి తప్పుల కారణంగా జరిగినట్లు చెప్పింది.ఒకసారి తన కారు పూర్తిగా దెబ్బతిందని.. జాబ్ కలిసి రావటం లేదని దాన్ని మానేసినట్లు చెప్పింది. జాబ్ రిజైన్ చేసి.. కొత్త జాబ్ లో చేరటం.. అనుకోని రీతిలో గ్లామర్ ఇండస్ట్రీలోకి రావటం చూస్తే.. రాసి పెట్టి ఉంటే జరగకుండా ఉంటుందా? అన్న భావన కలుగక మానదు.