Begin typing your search above and press return to search.

సాంగ్ టాక్‌: టోపీతో బన్నీ.. హాటుగా అను

By:  Tupaki Desk   |   30 April 2018 6:56 AM GMT
సాంగ్ టాక్‌: టోపీతో బన్నీ.. హాటుగా అను
X
డ్యాన్స్ విషయంలో అల్లు అర్జున్ ని సెపరేట్ స్టైల్. ముఖ్యంగా ఫ్లోర్ డ్యాన్సింగ్ విషయంలో.. లెగ్ మూమెంట్స్ లోను తన రేంజ్ లో మరెవరూ చేయలేరు అనిపించేలా ఆటాడేసుకుంటాడు. అలాగే ప్రతీ సినిమాకు ఓ ప్రత్యేకత కూడా చాటడం బన్నీ స్పెషాలిటీ.

ఈ వారంలో రిలీజ్ కానున్న నా పేరు సూర్య మూవీ చిత్రంలో అల్లు అర్జున్ కంప్లీట్ గా యాంగ్రీ పర్సనాలిటీగా కనిపించబోతున్నాడనే విషయం.. ఫస్ట్ ఇంపాక్ట్ నుంచి చూపిస్తూనే ఉన్నారు. అయితే.. సోల్జర్ లో కూడా లవర్ యాంగిల్ ఉందనే సంగతిని ఇప్పటివరకూ చూచాయగా చెప్పగా.. ఇప్పుడు ఆడియోతో ఈ విషయాన్ని కన్ఫాం చేశారు. లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో అంటూ సాగే పాటను కంప్లీట్ గా అమెరికా బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమో ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అయిపోవడంలో ఆశ్చర్యంలేదు. అందుకు మెయిన్ రీజన్.. బన్నీ వేసిన స్టెప్స్. నిమిషం నిడివి కూడా లేని ప్రోమోలో.. బన్నీ వేసిన స్టెప్స్ అదరహో అనిపించేలా ఉన్నాయి.

అన్నిటికంటే ముఖ్యంగా టోపీతో బన్నీ ఆడిన ఆటలు మామూలుగా లేవు. ఆ హ్యాట్ కూడా తన బాడీలో ఒక పార్ట్ అనిపించే రేంజ్ లో ఆడించేశాడు అల్లు అర్జున్. ఈ స్థాయిలో ఒక టోపీతో కూడా స్టెప్పులు వేయించడం ఒక్క బన్నీకి మాత్రమే సాధ్యం. ఇక ఈ పాటలో హీరోయిన్ అను ఇమాన్యుయేల్ అందాలను ఆరబోసింది కానీ.. బన్నీ డ్యాన్స్ ముందు అవి వెనుకంజ వేసేశాయి. అందరి కళ్లూ అల్లు అర్జున్ స్టెప్స్ చుట్టూనే తిరిగేస్తున్నాయి. కాని అనూ అందాలను కూడా హాటుగానే ఉన్నాయిలే

వీడియో కోసం క్లిక్ చేయండి