Begin typing your search above and press return to search.
లో బడ్జెట్ చిత్రాలకు టైమొచ్చిందా?
By: Tupaki Desk | 12 Oct 2019 7:07 AM GMTసాహో.. సైరా నరసింహారెడ్డి లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాలు చిన్న సినిమాల్ని డైలమాలో పడేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు రిలీజవ్వడంతో పరిమిత (లో) బడ్జెట్ సినిమాలకు లైన్ క్లియర్ అయింది. ఆగస్టు 30న సాహో రిలీజ్ అయితే.. అక్టోబర్ 2న సైరా చిత్రాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు రిలీజ్ నేపథ్యంలో దాదాపు ఈ రెండు నెలల్లో చాలా చిన్న సినిమాలు వాయిదా పడ్డాయి. తేదీల్ని ప్రకటించి వాయిదా వేసుకోవాల్సిన సన్నివేశం ఎదురైంది. ఇక జనవరి వరకూ స్టార్ హీరోల సినిమాలేవి రిలీజ్ కు లేవు. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తోన్న డిస్కోరాజా.. మెగా మేనల్లుడు సాయి తేజ్ నటిస్తోన్న `ప్రతి రోజు పండగే` డిసెంబర్ 20న రిలీజవుతున్నాయి. నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న భీష్మ అదే నెల 25న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈరెండు నెలల వ్యవధిలో చాలా చిన్న సినిమాలు రిలీజ్ తేదీలను లాక్ చేసుకున్నాయి. రాగల 24గంటల్లో- సాఫ్ట్ వేర్ సుధీర్-మీకు మాత్రమే చెప్తా-ఇద్దరిలోకం ఒకటే-రాహు-ఆవిరి-రాజు గారి గది3-ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఇలా మొత్తం డజనుకు పైగా చిన్న చిత్రాలు అక్టోబర్- నవంబర్ లో విడుదలకు క్యూ కట్టాయి. బడ్జెట్ లో అవ్వొచ్చు కానీ కంటెంట్ రిచ్ అంటూ వీళ్లంతా నమ్మకంగా వచ్చేస్తున్నారు. పైగా నవంబర్ మరీ అంత చెప్పుకోదగ్గ మాసం కాదు కాబట్టి వేరొక పెద్ద సినిమా పోటీ ఉండనే ఉండకపోవడం తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు.
ఇక వీటిలో రాగల 24 గంటల్లో- రాజుగారి గది-3- ఆపరేషన్ గోల్డ్ ఫిష్ - ఆవిరి చిత్రాలకు మేకర్స్ ప్రచారంలో వేగం పెంచుతున్నారట. వీటితో పాటు ఇంకా పలు తమిళ్ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ లకు రెడీ అవుతున్నాయి. ఇవేవి స్టార్ హీరోల సినిమాలు కాదు. కేవలం కంటెంట్ ఆధారంగానే ఆడాల్సి ఉంటుంది. మరి వీటిలో బాక్సాఫీస్ ను షేకాడించే సత్తా ఎన్ని చిత్రాలకుందో చూడాలి. అటుపై జనవరిలో సరిలేరు నీకెవ్వరు- అల వైకుంఠపురంలో- దర్బార్ చిత్రాలు బాక్సాఫీస్ పోరుకు సిద్దమవుతున్నాయి. వీటితో పాటు టాలీవుడ్ లో నాలుగైదు చిత్రాలు ఈసారి సంక్రాంతి రేసులో రానున్నాయని తెలుస్తోంది.