Begin typing your search above and press return to search.
బుల్లి సినిమాలు.. భలే విజయాలు
By: Tupaki Desk | 3 July 2016 5:30 PM GMTఈ ఏడాది సంక్రాంతి బరిలోకి బాలకృష్ణ, నాగార్జున - తారక్ లు వంటి తలపండిన వారు తలపడుతుంటే నాకెందుకని ఊరుకోకుండా ఆ గ్యాప్ లోనే విడుదల చేసి హిట్ అయిన సినిమా ఎక్స్ ప్రెస్ రాజా. పెద్దగా క్రేజ్ లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించి, పక్కా ప్లానింగ్ వుంటే పెద్ద సినిమాలు చిన్న చిత్రాలను ఎప్పుడూ డామినేట్ చేయవని రుజువుచేసింది.
ఈ ఒక్క సినిమానేకాదు ఈ ప్రథమార్ధంలో భారీ బడ్జెట్ సినిమాల హిట్ సంఖ్యతో సమానంగా మినీ బడ్జెట్. మీడియం బడ్జెట్ సినిమాలు కూడా విజయం సాధించడం గమనార్హం. రామ్ నటించిన నేను శైలజ - కృష్ణగాడి వీరప్రేమగాధ - ఈడో రకం ఆడో రకం - క్షణం - సుప్రీమ్ - జెంటిల్ మన్ వంటి సినిమాలు చిన్న చిత్రాలుగా విడుదలై పెద్ద విజయాలు సాధించాయి.
వీటిపై అంచనాలు లేకపోవడం ఒక వరమైతే, రొటీన్ కి భిన్నంగా కాదాంశాలు వుండడం మరొక విశేషం. ఇక కంటెంట్ తో పాటూ పర్ఫెక్ట్ టైమింగ్ కూడా తోడవ్వడంతో తమిళ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు ఏ విధంగా లాభాల పంటపండిందో మనకు తెలుస్తూనే వుంది. ఈ విజయాలను దృష్టిలో పెట్టుకునే అల్లు అరవింద్ - దిల్ రాజు వంటి నిర్మాతలు కూడా చిన్న సినిమాలపై దృష్టిపెట్టడం నయా బిజినెస్ స్ట్రాటజీ.