Begin typing your search above and press return to search.
2016: చిన్న సినిమా చితగ్గొట్టేసింది
By: Tupaki Desk | 30 Dec 2016 7:30 PM GMT2016.. తెలుగు సినిమా ప్రియులు మరిచిపోలేని సంవత్సరం. గత కొన్నేళ్లతో పోలిస్తే ఈ ఏడాది సక్సెస్ రేట్ చాలా మెరుగ్గా ఉంది. ఈ ఏడాది బ్లాక్ బస్టర్లకు.. సూపర్ హిట్లకు కొదవలేదు. ఐతే భారీ సినిమాలు భారీ విజయం సాధించడం కంటే.. చిన్న సినిమాలు సక్సెస్ అయిన తీరే 2016ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన కొన్ని చిన్న సినిమాలు అనూహ్యమైన వసూళ్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసేశాయి.
ఈ కోవలో ముందు చెప్పుకోవాల్సింది ‘పెళ్లిచూపులు’ గురించే. కొత్త నటీనటులు.. కొత్త దర్శకుడు.. కొత్త నిర్మాత.. కొత్త టెక్నీషియన్లు.. ఐతేనేం ఏకంగా రూ.25 కోట్ల దాకా వసూళ్లతో సంచలనం సృష్టించిందీ సినిమా. అగ్ర నిర్మాత సురేష్ బాబు ఈ చిన్న చిత్రానికి అండగా నిలిచి.. విడుదలకు ముందే సినీ ప్రముఖులకు, మీడియాకు ప్రివ్యూలు వేసి సినిమాను ముందే జనాల్లోకి తీసుకెళ్లడం కలిసొచ్చింది. విజయ్ దేవరకొండ - రీతువర్మ జంటగా తరుణ్ భాస్కర్ రూపొందించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మొదలై అనూహ్యమైన వసూళ్లు రాబట్టింది. అమెరికాలో అయితే ఏకంగా 1.3 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టిందీ చిత్రం. అమెరికాలో తెలుగు సినిమాల చరిత్రలో పెట్టుబడి-రాబడి పరంగా ఇదే అతి పెద్ద హిట్ కావడం విశేషం. ఈ సినిమా పెట్టుబడి కేవలం రూ. 1.5 కోట్లే.
ఇక ‘క్షణం’ కూడా ‘పెళ్లిచూపులు’ తరహాలోనే సంచలన విజయం సాధించింది. అడివి శేష్ హీరోగా నటించి స్క్రీన్ ప్లే సహకారం కూడా అందించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు రవికాంత్ పేరెపు రూపొందించాడు. తెలుగులో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్‌లో ఇదొకటని నిస్సందేహంగా చెప్పొచ్చు. కోటి రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి రూ.15 కోట్ల దాకా వసూలు చేసిందీ చిత్రం. ఇక ఏడాది చివర్లో వచ్చిన నిఖిల్ చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ కూడా అనూహ్యమైన వసూళ్లు రాబట్టింది. వీఐ ఆనంద్ రూపొందించిన ఈ ఫాంటసీ ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించింది. డీమానిటైజేషన్ దెబ్బకు సినిమాలు విలవిలలాడిపోతున్న టైంలో వచ్చిన ఈ సినిమా.. ఏకంగా రూ.30 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం.
కమెడియన్ టర్న్డ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ రూపొందించిన ‘జ్యో అచ్యుతానంద’ కూడా తెలుగు ప్రేక్షకులకు ఆహ్లాదం పంచి.. మంచి విజయం సాధించింది. కలెక్షన్లు భారీగా రాలేదు కానీ.. నిర్మాతకు.. బయ్యర్లకు డీసెంట్ మూవీ అయింది ‘జ్యో అచ్యుతానంద’. ఈ ఏడాది వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటి అనడంలో సందేహం లేదు. మంచు విష్ణు-రాజ్ తరుణ్ కాంబినేషన్లో నాగేశ్వరరెడ్డి రూపొందించిన ‘ఈడోరకం ఆడోరకం’ కూడా తక్కువ బడ్జెట్లో రూపొంది.. మంచి విజయమే సాధించింది. అల్లు శిరీష్ హీరోగా పరశురామ్ తెరకెక్కించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ చిన్న సినిమాగా వచ్చి మంచి వసూళ్లు రాబట్టింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/