Begin typing your search above and press return to search.

లగపాటి వారసుడు తెరవెనక కథ

By:  Tupaki Desk   |   9 April 2019 10:11 AM GMT
లగపాటి వారసుడు తెరవెనక కథ
X
ఎంత చెట్టుకు అంత గాలి
'నా పేరు సూర్య' చిత్రంలో పతాక సన్నివేశాల్లో అన్వర్ పాత్రలో నటించి మెప్పించాడు లగడపాటి విక్రమ్ సహిదేవ్.

'రేసు గుర్రం', 'పటాస్', 'రుద్రమదేవి', 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' సినిమాల్లో బాల నటుడిగా ప్రసంశలు అందుకున్నాడు. ప్రస్తుతం 'ఎవడు తక్కువ కాదు' (ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్) అనే సినిమాతో నూనూగు మీసాల హీరోగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై సహిదేవ్ డాడ్ లగడపాటి శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే టీమ్ ప్రచారంలో వేగం పెంచింది. న్యూ ఏజ్ రివెంజ్ డ్రామా ఇది. విక్రమ్ సహిదేవ్, కథకు తగ్గట్టు వైవిద్యమైన పాత్రలో కనిపిస్తాడని, యాక్ష‌న్‌తో పాటు అందమైన టీనేజ్ ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిదని యూనిట్ చెబుతోంది. ‌‌‌‌‌‌‌ త్వరలో పాటలను, ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్స్ లో సహిదేవ్ లుక్ ఆకట్టుకుంది. టీనేజీ ప్రేమకథతో ప్రయోగం చేస్తున్నారని అర్థమవుతోంది. అలాగే సింగిల్స్ శ్రోతల్ని మెప్పిస్తున్నాయి. అయితే ఇదో లో ప్రొఫైల్ సినిమా అని మరోవైపు అర్థమవుతోంది.

లగడపాటి రేంజుకు ఇదేంటీ? అంటూ ఓ ప్రశ్న వినిపిస్తోంది. బన్ని హీరోగా `నాపేరు సూర్య` లాంటి భారీ చిత్రాన్ని నిర్మించిన లగడపాటి శ్రీధర్ తనయుడిని మరీ ఇంత లోప్రొఫైల్ లో తెరకు పరిచయం చేయాలనుకోవడానికి కారణమేంటి? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే దేనికైనా ఓ పెర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుందని లగడపాటి సన్నిహితులు చెబుతున్నారు. కొడుకుని చిన్న సినిమాతో పరిచయం చేస్తున్నాడు అంటే పెద్ద సినిమా తీయరు అని కాదు. సహిదేవ్ హీరోగా బిగ్ మూవీ ఈ ఆగస్టులో ప్రారంభించాలన్న ప్లాన్ ఉందని చెబుతున్నారు.

లగడపాటి రేంజుకు తనయుడిని ఓ రేంజులో పరిచయం చేయొచ్చు.. కానీ స్లో ఫేస్ లోనే .. ఎందుకిలా పరిచయం చేశారు? అంటే.. ప్రస్తుతం ఇదంతా ప్రీప్రాక్టీస్ అని తెలుస్తోంది. `నా పేరు సూర్య` చిత్రం వల్ల బయ్యర్లు నష్టపోయినా లగడపాటి మాత్రం సేఫ్. అతడికి టేబుల్ పైనే డబ్బులొచ్చేశాయి. ఇకపోతే లగడపాటి రాజగోపాల్ అంతటి వేల కోట్ల సంపన్నుని సోదరుడిగా కొడుకును ఇంత సింపుల్ గా పరిచయం చేయాలనుకోవడానికి కారణం సినిమా పరిశ్రమపై పూర్తి అవగాహనతో వెళ్లడమేనట. కింగ్ నాగార్జున అంతటి హీరోనే నాగచైతన్యను జోష్ లాంటి మామూలు సినిమాతో పరిచయం చేశారు కదా..? ఎంత చెట్టుకు అంత గాలి.. అన్న చందంగా కొత్త హీరోకి ఎంత మార్కెట్ ఉంటుందో అంతే చేయాలి. కొంత పేరొచ్చాక జూలు విదల్చాలి. అదీ ప్లాన్ అన్నమాట.