Begin typing your search above and press return to search.
బన్నీ ఊపిరి పీల్చుకోవచ్చు..
By: Tupaki Desk | 6 May 2018 8:23 AM GMTఅల్లు అర్జున్ కొత్త సినిమా ‘నా పేరు సూర్య’ ఓ మోస్తరు టాక్ తో మొదలైంది. కలెక్షన్లు పర్వాలేదనిపిస్తున్నాయి. ఐతే ఈ చిత్రంపై బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావాలంటే బాక్సాఫీస్ దగ్గర అసాధారణంగా పెర్ఫామ్ చేయాల్సి ఉంది. ప్రమోషన్లు హోరెత్తించి.. వీకెండ్ తర్వాత కూడా వసూళ్లు నిలకడగా ఉండేలా చూస్తేనే బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో మీడియా సాయం బన్నీ అండ్ కోకు చాలా అవసరం. కానీ ఈ చిత్ర విడుదలకు ముందు మెగా ఫ్యామిలీ కొన్ని టీవీ ఛానెళ్లపై అప్రకటిత బ్యాన్ విధించింది. శ్రీరెడ్డి ఇష్యూ విషయంలో మీడియా పవన్ కళ్యాన్ కు వ్యతిరేకంగా కుట్ర పూరితంగా వ్యవహరించిందని ఆరోపించిన మెగా ఫ్యామిలీ కొన్ని ఛానెళ్లపై బ్యాన్ విధించాలని పట్టుబట్టింది. అందుకు ఇండస్ట్రీ పెద్దలు అంగీకరించకపోయినప్పటికీ.. మెగా ఫ్యామిలీ మాత్రం తమ వరకు ఆ ఛానెళ్లకు దూరంగా ఉంది. అల్లు అర్జున్ ప్రి రిలీజ్ ప్రమోషన్లలో కొన్ని ఛానెళ్లను అవాయిడ్ చేశాడు.
ఐతే ఇప్పుడు ‘నా పేరు సూర్య’ టీం ప్రముఖ టీవీ ఛానెళ్లపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. మరోవైపు టీవీ ఛానెళ్లు కూడా శ్రీరెడ్డి ఇష్యూతో చాలా బద్నాం అయ్యాయి. మెగా ఫ్యామిలీ అభిమానులు.. సామాన్య జనాలు కూడా వ్యతిరేకత ప్రదర్శించడంతో వాటి టీఆర్పీ రేటింగ్స్ కూడా పడిపోయాయి. దీంతో వాళ్లు కూడా ఇండస్ట్రీతో రాజీకి రావాల్సిన పరిస్థితి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఇరు వర్గాల నుంచి రాజీ ప్రయత్నాలు జరిగాయని.. అన్ని ఇష్యూస్ సెటిలైపోయాయని అంటున్నారు. ‘నా పేరు సూర్య’కు సంబంధించిన ప్రముఖ టీవీ ఛానెళ్లలో ప్రమోషనల్ షోస్ ప్లాన్ చేశారట. ఇందుకు ప్రతిగా ప్రకటనలు ఇవ్వడానికి కూడా నిర్మాత సిద్ధమయ్యారట. మొత్తానికి ఉభయతారకంగా కార్యక్రమాలు ప్లాన్ చేసుకుందామన్న అంగీకారానికి వచ్చారట. సోమవారం నుంచి కలెక్షన్లు నిలబడాలంటే మీడియా అవసరం చాలా అవసరమైన బన్నీ అండ్ టీం ఈ పరిణామాలతో ఊపిరి పీల్చుకుంటున్నట్లు సమాచారం.