Begin typing your search above and press return to search.

నాన్నా పులి క‌థ‌.. కొత్త సినిమాల వ్య‌ధ‌

By:  Tupaki Desk   |   29 April 2022 2:30 AM GMT
నాన్నా పులి క‌థ‌.. కొత్త సినిమాల వ్య‌ధ‌
X
క‌రోనా కార‌ణంగా చాలా వ‌ర‌కు సినిమాలు థియేట‌ర్లో విడుద‌లై దాదాపు రెండేళ్లు కావ‌స్తోంది. స‌రైన వాతావ‌ర‌ణం లేక‌పోవ‌డం, థియేట‌ర్ల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవ‌డం.. ఒక వేళ అనుమ‌తులు మంజూరు చేసినా 50 శాతం సీటింగ్ కెపాసిటీకి మాత్ర‌మే వీలు క‌ల్నించ‌డంత చాలా వ‌ర‌కు స్టార్ హీరోల చిత్రాలు రిలీజ్ ల‌ను గ‌త కొన్ని నెల‌లుగా వాయిదా వేసుకుంటే వ‌చ్చాయి. అయితే తాజాగా ప‌రిస్థితుల్లో మార్పులు మొద‌లై 100 శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో వ‌రుస‌గా సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డం మొద‌లైంది.

అయితే ఇంత కాలంగా థియేట‌ర్ల కార‌ణంగా రిలీజ్ లు వాయిదా వేసుకున్న చిత్రాల లిస్ట్ భారీగా పెరిగిపోవ‌డంతో బంచ్ లు బంచ్ లుగా థియేట‌ర్ల‌లో కి రావ‌డం మొద‌లైంది. పాన్ ఇండియా చిత్రాల రిలీజ్ లు వుండ‌టంతో చాలా వ‌ర‌కు చిన్న సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి, మార్చి, ఏప్రిల్ ల‌లో బిగ్ మూవీస్ రిలీజ్ కావ‌డంతో ఈ నెల్లోల రిలీజ్ కావాల్సిన సినిమాల‌న్నీ దాదాపుగా పోస్ట్ పోన్ అవుతూ వ‌స్తున్నాయి. ఇప్ప‌టికి ఒక్కో సినిమా రిలీజ్ డేట్ ల‌ని నాలుగైదు సార్లు మార్చేసింది. దీంతో కొత్త సినిమాల ప‌రిస్థితి నాన్నా పులి.. ఆట‌లా మారింది.

ఈ ఆట‌లో ముందు వ‌రుస‌లో నిలిచిన చిత్రం 'మేజ‌ర్‌'. అనురాగ్ రెడ్డి, శ‌ర‌త్ చంద్ర ల‌తో క‌లిసి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ముంబై బాంబ్ బ్లాస్ట్ ల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని శ‌శికిర‌ణ్ తిక్క తెర‌కెక్కించారు. అడివి శేష్ హీరోగా న‌టించిన చిత్ర‌మిది. సందీప్ ఉన్నికృష్ణ‌న్ రియ‌ల్ స్టోరీ నేప‌థ్యంలో ఈ మూవీని తెలుగు, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో రూపొందించారు. గ‌త ఏడాది జూలై 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ కుద‌ర‌లేదు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 11న విడుద‌ల విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే అది కూడా కుద‌ర‌క‌పోవ‌డంతో మే 27ను ఫైన‌ల్ చేసుకున్నారు. ఈ డేట్ ని మిగ‌తా సినిమాలు ఆక్ర‌మించుకోవ‌డంతో మ‌ళ్లీ రిలీజ్ డేట్ ని మార్చేశారు. ఫైన‌ల్ గా 'మేజ‌ర్' రిలీజ్ డేట్ జూన్ 3కు మారింది.

తెలుగు, హిందీతో పాటు త‌మిళంతోనూ రిలీజ్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఇదే త‌ర‌హాలో 'ఎఫ్ 3' కూడా చాలా సార్లు వాయిదాప‌డుతూ వ‌చ్చింది. ముందు ఈ మూవీని ముందు గ‌త ఏడాది ఆగ‌స్టు 27న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ క‌రోనా కార‌ణంగా వాయిదా వేయాల్సి వ‌చ్చింది. ఆ త‌రువాత జ‌న‌వ‌రిలో ఎట్టిప‌రిస్థితుల్లో రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ అదే స‌మ‌యంలో రాధేశ్యామ్‌, ట్రిపుల్ ఆర్ రిలీజ్ అంటూ ప్ర‌క‌ట‌న రావ‌డంతో ఆ నిర్ణ‌యాన్ని విర‌మించుకున్నారు. త‌రువాత ఫిబ్ర‌వ‌రి 25 అనుకున్నారు. కానీ 'భీమ్లానాయ‌క్‌' రావ‌డంతో త‌న‌తో క్లాష్ అని త‌ప్పుకున్నారు. ఏప్రిల్ 28ని లాక్ చేసుకోవాల‌నుకున్నారు అదే స‌మ‌యంలో 'ఆచార్య‌' రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించ‌డంతో చివ‌రికి మే 27ని ఫైన‌ల్ చేసుకోవాల్సి వ‌చ్చింది.

ఇదే త‌ర‌హాలో నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ 'అంటే సుంద‌రానికి' చిత్రం కూడా మ‌ల్టీపుల్ టైమ్స్ రిలీజ్ డేట్ ని మార్చుకుకోవాల్సి వ‌చ్చింది. గ‌త ఏడాదే రిలీజ్ చేయాల‌నుకున్నా కోవిడ్ కార‌ణంగా వాయిదా వేశారు. ఇక స‌మ్మ‌ర్ సీజ‌న్ ప్రారంభానికి ముందు రిలీజ్ అనుకున్నారు. అయితే బ్యాక్ టు బ్యాక్ బిగ్ స్టార్స్ మూవీస్ వుండ‌టంతో మ‌ళ్లీ వెన‌క్కి త‌గ్గారు. ఫైన‌ల్ గా జూన్ 10 ని లాక్ చేసుకున్నారు. ఇక మాస్ మ‌హారాజా ర‌వితేజ సినిమా ప‌రిస్థితి కూడా ఇలాగే వుంది.

ర‌వితేజ న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ మూవీని ముందు మార్చి 25న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్ర‌క‌టించారు కూడా. కానీ దే స‌మ‌యంలో 'ట్రిపుల్ ఆర్' రిలీజ్ అని క్లారిటీ రావ‌డంతో వెన‌క్కి త‌గ్గారు. ఫైన‌ల్ గా ఇప్పుడు జూన్ 17కు డేట్ మారింది. విశ్వ‌క్ సేన్ 'అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం' రిలీజ్ కూడా మూడు సార్లు మారాల్సి వ‌చ్చింది. ఏప్రిల్ 22న అనుకున్నా అది కాస్తా 30కి మారింది. అయితే 'ఆచార్య‌' వుండ‌టంతో చివ‌రికి మే 6కి మార్చుకోక త‌ప్ప‌లేదు.