Begin typing your search above and press return to search.
#లూసీఫర్ రీమేక్.. పుకార్లకు పాత పోస్టర్ తో బురుడీ!
By: Tupaki Desk | 30 May 2021 7:51 AM GMTమెగాస్టార్ చిరంజీవి `ఆచార్య` తర్వాత లూసీఫర్ రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. తని ఒరువన్ ఫేం రీమేక్ స్పెషలిస్ట్ మోహన్ రాజాను దర్శకుడిగా ప్రకటించారు. ఆయన ఇటీవల రీమేక్ స్క్రిప్టు ను రెడీ చేస్తూ కాస్టింగ్ పైనా దృష్టి సారించారు. అయితే ఉన్నట్టుండి ప్రీప్రొడక్షన్ దశలోనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని మోహన్ రాజా తన స్క్రిప్టుతో ఒప్పించలేకపోయారని కూడా కథనాలొచ్చాయి.
నిజానికి ఇవన్నీ రూమర్లు మాత్రమేనని ఆ తర్వాత కొణిదెల కాంపౌండ్ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మోహన్ రాజా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ కొణిదెల సంస్థ పీఆర్వో మోహన్ రాజా బర్త్ డే విషెస్ పోస్టర్ ని నిన్న సాయంత్రం ట్విట్టర్ లో రిలీజ్ చేసింది. దీంతో డైరెక్టర్ మార్పుపై అన్ని సందేహాలకు చెక్ పెట్టేసినట్టేనా? అంటే.. ఇప్పుడు రకరకాల కొత్త డౌట్లు పుట్టుకొచ్చాయి.
నిజానికి దర్శకుడు మోహన్ రాజా (45) బర్త్ డే ఈరోజు కాదు. జనవరి 15 ఆయన బర్త్ డే. ఈ పోస్టర్ అప్పట్లో ముద్రించినది. కొణిదెల బ్యానర్ లోగోతో అప్పట్లో బయటికి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే పోస్టర్ ని రిపీట్ చేసారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై వివరణ ఇస్తారేమో చూడాలి.
ఇటీవలి కాలంలో కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల మాత్రమే ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతోందని తెలిసింది. లాక్ డౌన్లు ముగిశాక ఆచార్య పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేయగానే తదుపరి ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాల్ని వెల్లడిస్తారు.