Begin typing your search above and press return to search.
తెలుగు లూసీఫర్ కు అంత సెట్ అయినట్లేగా..!
By: Tupaki Desk | 7 Aug 2021 3:30 PM GMTమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన లూసీఫర్ సినిమా సూపర్ హిట్ ను దక్కించుకుంది. ఆ సినిమా విడుదల అయిన సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా ను తెలుగు లో రీమేక్ చేయాలనుకున్నాడట. సినిమాలో మోహన్ లాల్ పోషించిన పాత్ర చిరంజీవికి బాగా నచ్చిందని.. అందుకే సినిమాను రీమేక్ చేయాలని ఆసక్తి చూపించాడు. కథ చాలా పవర్ ఫుల్ గా ఉండటంతో పాటు అన్ని పాత్రలు కూడా చాలా పవర్ ఫుల్ గా సినిమాలో ఉంటాయి. ఆ కారణంగా కూడా చిరంజీవి ఈ సినిమాను చేసేందుకు ఒప్పుకుని ఉంటాడు అనడంలో సందేహం లేదు.
గత ఏడాదిలోనే ఈ రీమేక్ పట్టాలు ఎక్కాల్సి ఉంది. కాని కరోనా కారణంగా ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న ఆచార్య సినిమానే షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. రెండు పాటలు షూట్ చేస్తే ఆచార్య షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టేయవచ్చు. ఆచార్యకు గుమ్మడి కాయ కొట్టకుండానే లూసీఫర్ రీమేక్ కు క్లాప్ కొట్టే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లూసీఫర్ సినిమా షూటింగ్ అతి త్వరలోనే పట్టాలెక్కబోతుంది.
తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. సినిమాలోని కీలక పాత్రలకు గాను నటీ నటుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తి అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలోని ఒక కీలక పాత్రకు గాను యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ ను ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. విలన్ గా ఒరిజినల్ వర్షన్ లో వివేక్ ఒబేరాయ్ నటించాడు. ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా విలక్షణంగా ఉంటుంది. పొలిటికల్ పవర్ కోసం ప్రాకులాడే ఆ పాత్ర ఎంతటి క్రూరమైనదో ఒరిజినల్ వర్షన్ లో చూపించడం జరిగింది. ఆ పాత్రను తెలుగు లో సత్యదేవ్ చేస్తే బాగుంటుందని చిరంజీవి అనుకోవడం.. అంతా కూడా ఔను అంటూ కమిట్ అవ్వడం జరిగిందట.
చిరంజీవి వంటి బిగ్గెస్ట్ స్టార్ సినిమాలో విలన్ పాత్ర ఏం కర్మ.. చిన్న పాత్ర అయినా చేసేందుకు చాలా మంది యంగ్ స్టార్స్ సిద్దంగా ఉన్నారు. అలాంటిది లూసీఫర్ వంటి బిగ్గెస్ట్ హిట్ రీమేక్ లో చిరంజీవికి సమానమైన విలన్ పాత్రలో కనిపించే అవకాశం వస్తే ఎవరు మాత్రం వదలుకుంటారు చెప్పండి. ఖచ్చితంగా ఈ సినిమా తనకు కెరీర్ లో చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ గా ఉంటుందని సత్యదేవ్ భావిస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. అలాగే సత్యదేవ్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్నాయి. సెట్టింగ్స్ తో పాటు అన్ని విషయాల్లో కూడా ఈ సినిమా యూనిట్ సభ్యులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లూసీఫర్ సినిమా తో పాటు చిరంజీవి వేదాళం రీమేక్ లో కూడా నటించేందుకు ఓకే చెప్పాడు. ఈ ఏడాది చివర్లో ఆ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్న చిరంజీవి కి లూసీఫర్ సినిమా సూపర్ హిట్ ను ఇస్తుందనే నమ్మకం అందరు వ్యక్తం చేస్తున్నారు. ఆచార్య సినిమా ను ఎప్పుడు విడుదల చేస్తారనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతోంది. ఆచార్య విడుదల అయితే ఆ తర్వాత లూసీఫర్ హడావుడి కనిపిస్తుంది.