Begin typing your search above and press return to search.
2022 తారల సందడి.. ప్లస్ ఎవరికి.. మైనస్ ఎవరికి..?
By: Tupaki Desk | 29 Dec 2022 4:38 AM GMTకమర్షియల్ సినిమా మీటర్ లెక్క సరిపోవాలి అంటే ఆ స్టార్ హీరోకి తగిన హీరోయిన్ కూడా ఉండాల్సిందే. ఒక సినిమా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయ్యింది అంటే అందులో కథానాయిక పాళ్లు కూడా కొద్దిగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఈ ఏడాది హీరోయిన్స్ కి కొంతమందికి బాగానే కలిసి వచ్చింది. మరికొంతమందికి నిరాశపరచింది. ఈ ఇయర్ లో అలరించిన హీరోయిన్స్ ఎవరు.. నిరాశపరచిన హీరోయిన్స్ ఎవరన్నది ఓ లుక్కేద్దాం.
2022లో కనిపించడానికి 3 సినిమాల్లో హీరోయిన్ గా.. ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ లో అంటే దాదాపు నాలుగు సినిమాల్లో కనిపించి అలరించినా సరే కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అందుకోలేదు బుట్ట బొమ్మ పూజా హెగ్దే. తమిళంలో విజయ్ తో బీస్ట్ లో నటించిన ఈ అమ్మడు, ఆచార్యలో చరణ్ సరసన జోడీ కట్టింది. ప్రభాస్ రాధే శ్యామ్ లో కూడా ప్రేరణ పాత్రలో నటించింది. ఎఫ్3 లో కూడా స్పెషల్ సాంగ్ లో నర్తించింది. ఇన్ని చేసినా సరే పూజాకి 2022 అంతగా కలిసి రాలేదని చెప్పొచ్చు. లెక్క పెట్టడానికి నాలుగు సినిమాలు చేసినా సూపర్ హిట్ మాత్రం దక్కలేదని చెప్పొచ్చు.
ఇక ఈ ఏడాది రష్మిక కూడా తన హవా కొనసాగించాలని అనుకుంది. శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేసిన రష్మిక ఆ సినిమా జస్ట్ ఓకే అనిపించగా సీతారామం సినిమాలో ప్రత్యేక పాత్రలో మెప్పించింది. సీతారామం సెన్సేషనల్ హిట్ గా నిలిచి రష్మిక పేరు మారుమ్రోగేలా చేసింది. ఇదే కాదు బాలీవుడ్ లో అమితాబ్ తో కలిసి గుడ్ బై సినిమా చేసింది రష్మిక. అయితే ఆ సినిమా నిరాశపరచింది. త్వరలో సిద్ధార్థ్ మల్హోత్రా తో నటించిన మిషన్ మజ్ను సినిమా రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి వారసుడు సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది రష్మిక.
2022 లో కీర్తి సురేష్ మహేష్ తో సర్కారు వారి పాట సినిమా చేసింది. ఆ సినిమా హిట్ అనిపించుకోగా దానితో పాటుగా గుడ్ లక్ సఖి అని తను లీడ్ రోల్ లో నటించిన సినిమాతో నిరాశపరిచింది కీర్తి సురేష్. అయితే 2023లో మాత్రం అమ్మడి సినిమాల లిస్ట్ పెద్దగానే ఉంది. ఆల్రెడీ నాని దసరా లో నటిస్తున్న కీర్తి సురేష్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కూడా సిస్టర్ రోల్ లో నటిస్తుంది. ఈ ఏడాది సాయి పల్లవి రెండు సినిమాలతో అలరించింది. అందులో ఒకటి రానా విరాటపర్వం కాగా మరోటి డబ్బింగ్ సినిమా గార్గితో వచ్చింది. రెండు సినిమాల్లో తన నటనతో మరోసారి వావ్ అనిపించింది సాయి పల్లవి.
ఈ ఇయర్ లో తమన్నా నాలుగు సినిమాల్లో నటించింది. తెలుగులో F3, గుర్తుందా శీతాకాలం సినిమాలు చేసిన మిల్కీ బ్యూటీ బాలీవుడ్ లో బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి సినిమాలు చేసింది. హిందీలో చేసిన రెండు సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ లో కూడా నటిస్తుంది తమన్నా.
2022లో సమంత యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమర్షియల్ గా సినిమా సక్సెస్ అందుకుంది. దీనితో పాటుగా నెక్స్ట్ ఇయర్ శాకుంతలం, ఖుషి సినిమాలతో రాబోతుంది. ఈ ఏడాది శృతి హాసన్ నటించిన సినిమాలు రిలీజ్ కాలేదు కానీ వచ్చే సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి రెండిటిలో ఆమె హీరోయిన్ గా నటించింది. అదే కాదు ప్రభాస్ సలార్ లో కూడా శృతి హాసన్ నటించింది. ఈ 3 సినిమాలతో 2023 టాప్ లేపేయబోతుంది శృతి హాసన్. ఇక రకుల్ ఈ ఏడాది కేవలం హిందీ సినిమాలు చేసింది.
పాన్ ఇండియా సినిమాల ప్రభావం వల్ల హీరోయిన్స్ కి కూడా ప్రాధాన్యత పెరిగింది. అందుకే చేస్తున్న సినిమాల్లో హీరోయిన్ కి మంచి మైలేజ్ వచ్చేలా చేస్తున్నారు. 2023 ఏ హీరోయిన్ ఏ రేంజ్ లో తమ సినిమాలతో సత్తా చాటనున్నారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.