Begin typing your search above and press return to search.
లోక నాయకుడితో జోడీ కట్టేస్తున్న మిల్క్ బ్యూటీ!
By: Tupaki Desk | 8 Dec 2021 2:30 AM GMTలోక నాయకుడు, విశ్వ నటుడు కమల్ హాసన్ - ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ల కలయికలో వచ్చిన చిత్రం `ఇండియన్`. 1996లో వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో `భారతీయుడు` పేరుతో అందించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా కమల్ - శంకర్ల కెరీర్లో మరపురాని చిత్రంగా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ సినిమాకు సీక్వెల్ గా `ఇండియన్ 2`ని తెరపైకి తీసుకొచ్చారు శంకర్.
కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ని మొదలుపెట్టారు. ఈ సినిమాని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్న వారితో పాటు ఇందులో నటిస్తున్న వారు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. కీలక పాత్రలో నటించిన నెడిముడి వేణు అనారోగ్యంతో చనిపోగా.. ఆ తరువాత వివేక్ హార్ట్ ఎటాక్‌తో కన్ను మూశారు. ఇక ఆ మధ్య ఫ్లోర్లో క్రేన్ల మధ్య షూటింగ్ చేస్తుండగా క్రేన్ కూలి డైరెక్షన్ డిపార్ట్ మెంట్‌కి చెందిన వారు మరణించారు.
దీంతో ఈ మూవీ షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. శంకర్ ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కించాలనుకున్న ఈ ప్రాజెక్ట్ కు అడుగడుగునా అవాంతరాలు ఎదురవ్వడంతో శంకర్‌తో పాటు అంతా విస్తూ పోతున్నారు. తాజాగా శంకర్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా తప్పుకోవడంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ కోసం శంకర్ వేట మొదలుపెట్టారు. సినిమా పూర్తి చేయడం కోసం నిర్మాత కోర్టు దాకా వెళ్లడంతో మనసు మార్చుకున్న శంకర్ ఈ మూవీని పూర్తి చేసే పనిలో వేగం పెంచారు.
కాజల్ స్థానంలో మిల్క్ బ్యూటీ తమన్నానని ఫైనల్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఆమె ఇండియన్ 2 నుంచి తప్పుకోవడంతో మిల్క్ బ్యూటీని ఆ స్థానంలో శంకర్ ఫైనల్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. ప్రస్తుతం తమన్నా కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. శంకర్ ఇచ్చిన ఈ ఆఫర్ తన కెరీర్ ని మళ్లీ గాడిలో పెట్టి మరింత బూస్టప్ చేస్తుందని అంతా అంటున్నారు.