Begin typing your search above and press return to search.
విజయ్ దేవరకొండ వంటి నిర్మాత దొరకడం నా అదృష్టం
By: Tupaki Desk | 31 Oct 2021 10:30 AM GMTఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా 'పుష్పక విమానం' సినిమా రూపొందింది. కామెడీ పాళ్లు ఎక్కువ కలిసిన ఈ సినిమాకి దామోదర దర్శకత్వం వహించాడు. నిన్నరాత్రి జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వేదికపై ఆయన మాట్లాడుతూ .. "ముందుగా నేను అల్లు అర్జున్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఈ రోజున ఇక్కడికి ఒక మంచి సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చారు. అల్లు అర్జున్ గారు వస్తున్నారంటేనే అభిమానుల మెసేజ్ లతో సోషల్ మీడియా వేడెక్కిపోయింది. 'పుష్పక విమానం' టీమ్ నుంచి అల్లు అర్జున్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెబుతున్నాను.
మనం ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు .. 'ఎలా ఉందిరా' అని ఫ్రెండ్స్ అడిగితే బాగుందంటాం .. బాలేదని అంటాం .. టైమ్ పాస్ మూవీ అంటాం .. లేదంటే టైమ్ వేస్టు మూవీ అంటాం. కానీ మనీ వేస్టు మూవీ అని అనం. ఎందుకంటే ఒక సినిమాకి మనం ఇచ్చే మనీ కన్నా టైమ్ చాలా విలువైనది. ఒక హోటల్ కి వెళ్లి దోశ .. ఇడ్లీ తింటే 200 అయిపోతాయి. కానీ మనం 100 రూపాయల్లో చాలా క్వాలిటీతో కూడిన ఫిల్మ్ చూస్తాము. మీ విలువైన సమయాన్ని వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే ఏ దర్శకుడైనా కథ రాసుకుంటాడు.
అలా నేను రాసుకున్న కథనే 'పుష్పక విమానం' .. ఇది చాలా మంచి కథ. ఒక మంచి కథ ఒక మంచి సినిమా కావడానికి చాలామంది తోడు కావాలి. ఆ కథలో ఉన్న కొత్తదనాన్ని అర్థం చేసుకునే ప్రొడ్యూసర్ కావాలి. ఆ కథను అర్థం చేసుకోవడమే కాకుండా ఒక దర్శకుడిగా నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన నిర్మాత విజయ్ దేవరకొండ. విజయ్ ఏ పనైనా మనసుకు నచ్చితేనే చేస్తాడు .. లేదంటే చేయడు. ఈ సినిమా నిర్మాతగా ఆయన ఎప్పుడూ సెట్ కి రాలేదు .. ఏం చేశామో చూడలేదు. సినిమా పూర్తయిన తరువాత ఒక ఆడియన్ లా చూసి, ఇప్పుడు నేను ప్రమోట్ చేస్తాను అన్నారు.
విజయ్ దేవరకొండ వంటి నిర్మాత నా ఫస్టు ఫిల్మ్ కి దొరకడం నాకు ఆనందాన్ని కలిగించే విషయం. 'పుష్పక విమానం' అనేది ఒక కామెడీ థ్రిల్లర్ .. కొత్త కాన్సెప్ట్ తో వస్తోంది. చిట్టిలంక సుందర్ అనే ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ కథ ఇది. ఈ సినిమా చూసిన తరువాత ఒక సీనియర్ టేక్నీషియన్ ఒక మాట అన్నారు. సినిమా అంతా ఒక్క రోజులో షూట్ చేస్తే, ఎలా కంటిన్యుటి ఉంటుందో అలా ఉందనీ, ఆనంద్ దేవరకొండ అంతబాగా ఫెర్ఫార్మ్ చేశాడని అన్నారు. అది చాలా పెద్ద విషయం.
ఈ సినిమా చూసినవాళ్లకి చిట్టిలంక సుందర్ అనేవాడు గుర్తుండిపోతాడు. కళ్లద్దాలు పెట్టుకుని .. లంచ్ బాక్స్ పట్టుకుని .. అమాయకంగా కనిపించే చిట్టిలంక సుందర్ నవ్విస్తాడు .. ఏడిపిస్తాడు. కొంతమంది ఆర్టిస్టులకి తమ టాలెంట్ ను బయటపెట్టే రోల్స్ రావాలి. అల్లు అర్జున్ గారిని తీసుకుంటే 'గంగోత్రి' తరువాత వచ్చిన 'ఆర్య' ఆయన టాలెంట్ ను బయటపెట్టింది. విజయ్ ని తీసుకుంటే 'అర్జున్ రెడ్డి' అనేది తనలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టింది. అలాగే చిట్టిలంక సుందర్ అనేది ఆనంద్ లో ఉన్న టాలెంట్ ను బయటపెట్టే కేరక్టర్" అంటూ చెప్పుకొచ్చాడు.